E-Paper
Advertisement

IIIT Admissions: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. ట్రిపుల్ ఐటీ ప్రవేశాల షెడ్యూల్ ఖరారు, అప్లికేషన్ ఎప్పటినుంచంటే..?

IIIT Admissions: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. ట్రిపుల్ ఐటీ ప్రవేశాల షెడ్యూల్ ఖరారు, అప్లికేషన్ ఎప్పటినుంచంటే..?
Advertisement

తెలంగాణలోని బాసర (నిర్మల్ జిల్లా), మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీ (RGUKT) క్యాంపస్‌లలో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. బాసర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్దన్ శుక్రవారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. పది గంటల లోపు పదో తరగతి పూర్తి చేసిన ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు ఇది గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు. రెండు క్యాంపస్‌లలో కలిపి అందుబాటులో ఉన్న సీట్ల భర్తీ ప్రక్రియను పారదర్శక పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ విధానంలోనే కొనసాగుతుంది. ఆసక్తి గల విద్యార్థులు టీజీ ఆన్‌లైన్ సెంటర్లు లేదా మీసేవ కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవచ్చు. నేరుగా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ సందర్శించి నిర్ణీత ఫీజు చెల్లించి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. మార్చి 16వ తేదీన అధికారిక ప్రకటన విడుదల కానుండగా.. మార్చి 18 నుండి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది. మే 10వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు. గడువు ముగిసిన అనంతరం దరఖాస్తుల పరిశీలన చేపడతారు.

Advertisement

మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్ జాబితాను మే 30న విడుదల చేస్తారు. ఎంపికైన వారికి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 5వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో క్యాంపస్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు నిబంధనల ప్రకారం కొంత అదనపు వెయిటేజీ మార్కులు కలుపుతారు. దీనివల్ల పల్లెటూరి పిల్లలకు నాణ్యమైన సాంకేతిక విద్య చేరువవుతుంది. ఆసక్తి కలిగిన స్లూడెంట్ ఈ అద్బుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ALSO READ: Telugu Movie Memes: గ్యాస్ కొరత.. ఈ ఫన్నీ సినిమా టైటిల్స్ చూస్తే.. నవ్వకుండా ఉండలేరు!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×