Hyderabad’ Amazon: కొత్త కొత్త ఆర్థిక మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. అన్నం పెడుతున్న ఇంటికి కన్నం వేశారు 22 మంది ఉద్యోగులు. ఒకటీ రెండు కాదు ఏకంగా రూ. 102 కోట్లు కొల్లగొట్టారు. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్ కేంద్రంగా ఉన్న అమెజాన్ ఈ-కామర్స్ సంస్థలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‌కు బురిడీ కొట్టించారు ఆ కంపెనీ ఉద్యోగులు. హైదరాబాద్ కేంద్రంగా ఈ మోసం బట్టబయలైంది. ఒకప్పుడు కాల్ సెంటర్‌లో పని చేసిన ఉద్యోగులు, గతంలో మానేసినవారంతా కలిసి ఈ స్కామ్‌కు తెరలేపారు. అమెరికాలో సరుకులు చేసేవారితో కలిసి కుట్ర చేశారు. వీరి చేసిన ఫ్రాడ్ వల్ల ఏకంగా 102 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నది ఆ సంస్థ మాట.
ఈ వ్యవహారంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అమెజాన్ ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. డెలివరి సందర్బంగా కస్టమర్లు ఇంట్లో లేక పోతే ఆ ఆర్డర్‌ను గచ్చిబౌలి టెక్నీకల్ టీమ్ కాల్ సెంటర్ ద్వారా క్యాన్సల్ చేస్తారు. కానీ డెలివరీ ఛార్జీలు మాత్రం ఆమెజాన్ చెల్లిస్తుంది. అయితే ఈ డెలివరీ బాధ్యతను ఇతర సంస్థకు అప్పగించింది అమెజాన్.
దీన్ని తమకు అనుకూలంగా మలచుకున్నారు కొందరు ఉద్యోగులు. డెలివరీ సంస్థ హైదరాబాద్‌కి చెందిన ఉద్యోగులను ప్రలోబాలకు గురి చేశారు. ఆపై ఈ మోసానికి పాల్పడ్డారు. తమ అంతర్గత ఆడిట్‌లో ఈ మోసం బయటపడింది. వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అమెజాన్ ప్రతినిధి అర్జున్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుంది.
ALSO READ: ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై యాక్సిడెంట్.. స్పాట్‌లో ముగ్గురు
అటు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సంస్థ ఫిర్యాదు చేసింది ఆ సంస్థ. ఈ మోసం విలువ అక్షరాలా రూ.102 కోట్లన్నమాట. మొత్తం 22 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.
సరుకు స్టోరేజ్ చేసే గోదాం నుంచి సరుకు తీసుకున్న తర్వాత చెక్ ఇన్ చేయడం సహజం. వినియోగదారులకు వస్తువు అందిన తర్వాత చెక్ అవుట్ చేయడం చూస్తూనే ఉంటాం. అయితే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నుంచి ప్రపంచవ్యాప్తంగా అమెరికా డెలివరీ కార్యకాలపాలను ఉద్యోగులు జాగ్రత్తగా పర్యవేక్షణ చేస్తారు.
సింపుల్‌గా చెప్పాలంటే ఈ విభాగాన్ని రిలే ఆపరేషన్ సెంటర్ గా వర్ణిస్తారు. ఈ సెంటర్‌లో పని చేసిన ఉద్యోగులు భారీ మోసానికి ఒడిగట్టారు. సరుకు డెలివరీకి వెళ్లకుండానే వెళ్లినట్టు నకిలీవి నమోదు చేయించారు. వినియోగదారులు లేరని చెబుతూ రవాణా ఛార్జీలను మొత్తం మింగేశారు. దీని విలువ అక్షరాలా 102 కోట్ల 88 లక్షల రూపాయలు.