Intinti Ramayanam Today Episode January 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని పల్లవి ఇదంతా చేసిందని తెలుసుకొని షాక్ అవుతుంది. ఎలాగైనా పల్లవి అంతు చూడాలని బయలుదేరుతుంది. ఈ విషయాన్ని పల్లవికి చెప్పి నువ్వు ఇలాంటి దానివి అని నేను అస్సలు అనుకోలేదు సొంత ఇంటిని కాటేయాలని చూస్తావా పాముకి పాలు పోసిన కాస్త జాలి చూపిస్తుందేమో కానీ నిన్ను ఇంట్లో పెట్టడం వల్ల ఇంటి నుంచి చేర్చాలని చూస్తావా ఇంకా అస్సలు నేను వదిలేది లేదు మీ అంతు చూస్తానని అవని ఇంటికి బయలుదేరుతుంది. పల్లవి అసలు నిజం ఎక్కడ బయటపడుతుందని భయపడుతుంది.. అవనిని ఇంట్లోంచి ఎలాగైనా గెంటించేయాలని అనుకుంటుంది. ఒకవేళ అవని నిజం చెప్తే నా బండారం బయటపడుతుంది నన్ను ఇంట్లోంచి గెంటేస్తారని భయపడుతుంది. అవని బయట పంపించేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తుంది. పల్లవి నాకు రెడీ అవ్వాలని అవినీలాంటి శారీ కోసం షాప్ అతనికి ఫోన్ చేసి అలాంటి శారీనే తీసుకొచ్చుకుంటుంది. అవని ముందుగా ఇంటికి వెళుతుంది. అవని వెనకాలే పల్లవి కూడా మరో ఆటోలో వెళుతుంది. అవని ఇంట్లోకి వెళ్ళగానే అత్తయ్య అని అరుచుకుంటూ వెతుకుతుంది. ఇప్పుడే వెనకాల ఆటోలో పల్లవి కూడా అవన్నీ ఇలాంటి శారీనే కట్టుకొని ఇంటికి వస్తుంది. పార్వతిని పైనుంచి తోసేస్తుంది పల్లవి. అవని శారీ చూసి అవి నేను ఇదంతా చేసిందని అనుకుంటుంది. ఇక పార్వతి స్పృహ తప్పి కింద పడిపోతుంది. అవని మాత్రం గదిలో ఎవరో గడి పెట్టారని గడియ తీయండి అని మొత్తుకుంటుంది. పార్వతి కింద పడిన తర్వాత పల్లవి ఆ గడియని తీస్తుంది. ఇక కిందికి వచ్చి చూడగానే పార్వతి కింద పడిపోతుంది.. పార్వతి ఎందుకు కింద పడిపోయింది అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు వెంటనే డాక్టర్ కి ఫోన్ చేసి డాక్టర్ని రమ్మని చెప్తారు.. పార్వతి లేవగానే అమ్మని తప్పు చేసిందని అంటుంది. ఇక అందరూ అమ్మని ఇదే తప్పని అంటారు. అవనిని బయటికి పంపించాలని పార్వతి అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నన్ను చెప్పాలని చూసింది నా ఇంట్లో ఉండడానికి వీలులేదని పార్వతి అందరి ముందర తేల్చేస్తుంది. కమల్ వినోద్ తప్ప ఇంట్లో వాళ్ళందరూ అవనినే అంటారు. ఆస్తి రాయించుకున్నావ్ ఇప్పుడు మా అమ్మని చంపాలని చూసావా మాకు మా అమ్మని దూరం చేయాలనుకుంటున్నావా అని అందరూ అడుగుతారు. ఇక పార్వతి నన్ను చంపాలని చూసినది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని రాజేంద్రప్రసాద్ అంటుంది కానీ రాజేంద్రప్రసాద్ మాత్రం మౌనంగా ఉంటాడు. అటు అక్షయ్ కూడా మౌనంగా ఉంటాడు.. ఇక పార్వతి ఇలాంటిది హంతకురాలు నా ఇంట్లో ఉంటే ఎవరినైనా చంపాలని చూస్తుందని ఇంట్లోంచి బయటికి గెంటేయాలని అంటుంది కానీ ఎవరు మౌనంగా ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో అవనిని ఇంట్లోంచి గెంటేస్తున్న అక్షయ్ మౌనంగా ఉంటాడు. అవని ఇంట్లోంచి వెళ్లకపోతే నేను వెళ్ళిపోతాను నేనే కదా తప్పు చేసిందని నా మాటని మీరు ఎవరు నమ్మట్లేదు కదా అని పార్వతి అంటుంది. వెళ్లిపోవడం ఎందుకు అత్తయ్య మీరు ఏ తప్పు చేయలేదు తప్పు చేశానని మీరే నన్ను అంటున్నారు నా మీద ఎంత పెద్ద నిందలు మోపారు కదా నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని అవని ఇంట్లోంచి బయలుదేరుతుంది.
ఇంట్లోంచి వెళ్ళిపోతున్న అవనికి ఎదురుగా ఆరాధ్యవస్తుంది. ఏమైందమ్మా నువ్వు ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నావు ఎందుకమ్మా ఏడుస్తున్నావ్ అని ఆరాధ్య అడుగుతుంది. ఆరాధ్య పద వెళ్లిపోదామని అవని ఆరాధ్యను తీసుకొని వెళ్ళిపోతుంది. పార్వతి ఎటు వచ్చి ఆరాధ్య కు ఇలాంటి బుద్ధులు నేర్పిస్తావా ఆరాధ్య నీ దగ్గర పెరగడానికి అస్సలు ఒప్పుకోను నీ బిడ్డ నీ దగ్గర పెరిగితే నీలాగే తయారవుతుంది ఇక్కడే ఏంటి బిడ్డగానే పెరుగుతుంది అనేసి పార్వతి ఆరాధ్యం లాక్కుంటుంది. అవని మాత్రం నా బిడ్డ నాకు దూరం చేస్తారు అత్తయ్య మీకు ఇది న్యాయమేనా అని అడుగుతుంది నువ్వు వెళ్ళమని చెప్తున్నానా వెళ్ళవా అని పార్వతి అవనిని ఇంట్లోంచి గెంటేస్తుంది. కమల్ మాత్రం అవని వెంట వస్తూ అమ్మతో నేను మాట్లాడతాను వదినా నువ్వు ఇంట్లోకి రానేసి బాధపడతాడు. నేను వెళ్లకపోతే అత్తయ్య వెళ్ళిపోతుంది మీ అమ్మ నీకు ఇంటి నుంచి వెళ్లడం సంతోషమేనా అందుకే నేను వెళ్ళిపోతున్నాను కన్నయ్య నేను నిర్దోషిని నిరూపించుకున్న తర్వాతే మళ్ళీ ఇంటిలో అడుగు పెడతానని అవని అంటుంది.
ఇక కమల్ శ్రీకర్ కి ఫోన్ చేస్తాడు. వదిన వెళ్ళిపోతుందన్నయని బాధపడతాడు. ఏమైంది రా అని అడిగితే మొత్తం విషయాన్ని శ్రీకర్కు కమల్ చెప్తాడు. ఇద్దరం కలిసి వదినని వెతుకుదామని శ్రీకర్ అంటాడు. ఇంట్లోకి వెళ్లిన కమల్ మీరందరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారా.. వదిన వెళ్ళిపోయింది కదా మీరు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు అనేసి అంటాడు ఇక ఆరాధ్య ఎక్కడ కనిపించలేదని అందరు వెతుకుతారు. అదే ఒక గదిలో కూర్చుని వాళ్ళ అమ్మ ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అది చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో అవనీ పై దొంగలు అటాక్ చేస్తారు మరి శ్రీకర్ వచ్చి అవనీని కాపాడుతారా లేదా చూడాలి..