Ranbir Kapoor: ఈరోజుల్లో చాలామంది బాలీవుడ్ హీరోలు తెలుగు తెరపై మనసు పారేసుకుంటున్నారు. తెలుగు దర్శకులతో నటించడానికి ఇష్టపడుతున్నారు. నేరుగా తెలుగు సినిమాలు చేసి ప్రేక్షకులను పలకరించాలని అనుకుంటున్నారు. అలా ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్ నటీనటులు తెలుగులో అడుగుపెట్టారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి రణబీర్ కపూర్ కూడా చేరనున్నాడని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. రణబీర్ టాలీవుడ్ ఎంట్రీ విషయంలో అన్ని రెడీ అయ్యాయని, ఒక మెగా హీరోలతో కలిసి చేసే సినిమాతో తను టాలీవుడ్ డెబ్యూ ఇవ్వనున్నాడని అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా వీటిపై ఒక క్లారిటీ వచ్చేసింది.
గ్రాండ్ డెబ్యూ
ప్రస్తుతం రణబీర్ కపూర్ (Ranbir Kapoor) చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులోని ముఖ్యంగా నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’.. రణబీర్ కెరీర్‌లోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కానుంది. దీంతో పాటు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో ‘లవ్ అండ్ వార్’ అనే మూవీ కూడా చేస్తున్నాడు. ఇక సందీప్ రెడ్డి వంగాతో ‘యానిమల్’ సీక్వెల్‌లో కూడా రణబీర్ నటించాల్సి ఉంది. అలా బీ టౌన్‌లోనే ఫుల్ బిజీగా ఉన్న రణబీర్ కపూర్.. త్వరలోనే తెలుగు తెరపై కనిపించనున్నాడని వార్తలు మొదలయ్యాయి. మెగా హీరో, గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ సినిమాలో రణబీర్ కీలక పాత్రలో నటించి తెలుగులో గ్రాండ్ డెబ్యూ ఇవ్వనున్నాడని రూమర్ వైరల్ అయ్యింది.
వర్కవుట్ అవ్వదు
బుచ్చిబాబు (Buchhi Babu) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఆర్సీ 16’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీలో రణబీర్ కపూర్ ఒక కీలక పాత్రలో నటించనున్నాడనే వార్తలు బయటికి రాగా అవన్నీ కేవలం రూమర్స్ అని తేలిపోయింది. ఈ మూవీలో ఒక పవర్‌ఫుల్ క్యామియోను ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు బుచ్చిబాబు. ఆ క్యామియో కోసం రణబీర్ కపూర్ అయితే బాగుంటుందని అనుకున్నా ఇప్పుడు అది వర్కవుట్ అవ్వదని తేలిపోయింది. ఒకవేళ ఇదే నిజమయ్యిందే అటు రామ్ చరణ్, ఇటు రణబీర్.. ఇద్దరి ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ అయ్యిదని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
Also Read: సీనియర్ హీరోలకు ఈయనే గోల్డెన్ డక్.. నాగ్ తెలుసుకుంటాడా.?
జాన్వీతో జోడీగా
‘ఆర్సీ 16’ (RC 16) విషయానికొస్తే.. ఇప్పటికే ఈ మూవీ గ్రాండ్‌గా పూజా కార్యక్రమంతో ప్రారంభమయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్నే అతిపెద్ద ఈవెంట్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. అదే సమయానికి ‘గేమ్ ఛేంజర్’తో రామ్ చరణ్ బిజీగా ఉండడంతో ‘ఆర్సీ 16’ రెగ్యులర్ షూటింగ్‌కు కాస్త సమయం పట్టింది. ఇప్పుడు చరణ్ ఫ్రీ అయిపోయాడు. అందుకే తన పూర్తి ఫోకస్ ఈ సినిమాపైనే ఉంది. ఇందులో ఈ మెగా హీరోకు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పటికే ఎన్‌టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది జాన్వీ. కానీ ఆ మూవీ తన యాక్టింగ్‌కు అంతగా స్కోప్ లేదు. కనీసం ‘ఆర్సీ 16’లో అయినా జరగకూడదని తన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.