BigTV English

Crime News: మాజీ డీజీపీని దారుణంగా చంపిన భార్య.. తర్వాత వీడియో కాల్ చేసి..

Crime News: మాజీ డీజీపీని దారుణంగా చంపిన భార్య.. తర్వాత వీడియో కాల్ చేసి..

Crime News: కర్నాటకలో దారుణ హత్య జరిగింది. బెంగుళూరులోని త‌న నివాసంలో 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్యకు గురయ్యారు. మొదట అనుమానాస్పద మృతిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో మాత్రం హత్య చేసినట్టు గుర్తించారు. ఓం ప్రకాష్ హత్య విషయానికి సంబంధించి 112 హెల్ప్‌లైన్‌కు వచ్చిన అత్యవసర కాల్ ద్వారా వెలుగులోకి వచ్చింది.


మృతుడి ఒంటిపై రెండు చోట్ల కత్తి పోట్లను సైతం పోలీసులు గుర్తించారు. మాజీ డీజీపీ చనిపోయారని సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. దర్యాప్తులో భాగంగా హత్య జరిగినట్టు గుర్తించారు. అయితే అత‌డి భార్య ప‌ల్లవినే హ‌త్య చేసి చంపిందని పోలీసులు పేర్కొన్నారు. గ‌త కొన్ని రోజుల నుంచి మాజీ డీజీపీ ఓం ప్ర‌కాష్ త‌న భార్య పల్లవికి మ‌ధ్య ఆస్తికి సంబంధించి గొడ‌వ‌లు జ‌రుగుతున్న‌ట్టు సమాచారం. మాజీ డీజీపీ తన ఆస్తిని భార్య పేరు మీద‌కు కాకుండా కుమారుడి పేరు మీద‌కు మార్చ‌డం వ‌ల్ల‌నే ఇంట్లో గొడ‌వ‌లు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది.

గొడ‌వ‌ల నేప‌థ్యంలో మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ ను భార్య పల్లవి కత్తితో పొడిచి దారుణంగా చంపినట్టు పోలీసులు పేర్కొన్నారు. కొద్ది కాలంగా పద్మ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య అనంతరం మరో ఐపీఎస్ భార్యకు వీడియో కాల్ చేసి రాక్షసుడిని చంపేశానని రక్తపుమడుగులో ఉన్న భర్త డెడ్ బాడీ చూపించింది. తనను ముందుగా భర్త ఓం ప్రకాశ్ హత్య చేయడానికి ప్రయత్నించాడని..అందుకుగానే చంపేశానని పల్లవి పోలీసులతో చెప్పింది.


ఓం ప్ర‌కాష్ బీహార్ రాష్ట్రానికి చెందిన‌వారు. మొదట ఆయన బళ్లారిలోని హరపనహల్లిలో ఎస్పీగా పని చేశారు. తరవాత కాలంలో అనేక కీలక పోస్టుల్లో విధులు నిర్వహించి 2015 లో డీజీపీగా నియమితులయ్యారు. 2017 సంవత్సరంలో రిటైర్మెంట్ తీసుకున్నారు.

Also Read: CM Chandrababu Birthday: సీఎం చంద్రబాబు బర్త్ డే వేడుకల్లో అపశృతి.. గుండెపోటుతో టీడీపీ నేత మృతి

Also Read: Road accident: విరిగిన స్టీరింగ్.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 25 మంది..?

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×