Karnataka: ఈ మధ్యకాలం ఎక్కడ చూసినా కొందరు నానా పులి వేషం వేస్తున్నారు. హైలైట్ కావాలని కొందరు.. వాటితో డబ్బు సంపాదించాలని మరికొందరు. ఆ సన్నివేశాలు చూసి సామాన్యులు హడలిపోతున్నారు. తాజాగా ఇన్‌స్టా రీల్స్ కోసం చిన్న డ్రామా ఆడారు ఇద్దరు వ్యక్తులు. చివరకు రియల్ కాదు.. రీల్ అని తేలడంతో అడ్డంగా బుక్కయ్యారు. సంచలనం రేపిన ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. అసలేం జరిగింది?
కర్ణాటకలోని కలబురిగి టౌన్‌లో అదే జరిగింది. ఆ సన్నివేశాల్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వాస్తవానికి ఇదంతా ఇన్‌స్టా రీల్స్ మోజులో ఇద్దరు యువకులు ఆడిన నాటకమని చివరకు తేలిపోయింది. ఈ వ్యవహారం చివరకు పోలీసుల దృష్టికి వెళ్లింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారిని అరెస్టు చేశారు.
కలబురిగి పట్టణం స్థానిక హుమ్నాబాద్ రింగ్ రోడ్డు ప్రాంతంలో సోమవారం రాత్రి ఫేక్ ఘటన జరిగింది. సాయి బన్నా- సచిన్ అనే ఇద్దరు వ్యక్తులు స్నేహితులు. ఏది చేసినా కలిచి చేసేవారు. కాకపోతే వారికి చిన్న పిచ్చి ఉంది. పబ్లిక్ అటెక్షన్ తమ మీద ఉండాలని కోరుకునేవారు. ఇందుకోసం సెల్‌ఫోన్ లో రీల్స్, యూట్యూబ్‌లో క్రైమ్ స్టోరీలను చూశారు.
ఈ క్రమంలో కొత్త ఆలోచన వారి మనసులోకి వచ్చింది. మనసుకు వచ్చిన ఆలోచనను అమలు చేయడం మొదలుపెట్టారు. రక్తంలా ఉండే రంగును, పదునైన ఆయుధాలు అయితే సీన్ రక్తి కడుతుందని భావించారు. హత్య కోసం నాటకం వేశారు. వారిద్దరు ఇన్‌స్టా రీల్ కోసం చేస్తున్న విషయం చాలామందికి తెలియలేదు. అటుగా వెళ్తున్నవారు ఆ సన్నివేశాలను చూసి భయపడిపోయారు.
ALSO READ: కృష్టాజిల్లాలో దారుణం, మైనర్ పై సామూహిక అత్యాచారం
కొందరైతే పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. చివరకు ప్రజల్లో అలజడి రేగింది. వీరిపై స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కలబురిగి సబర్బన్ పోలీసులు వీరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. రీల్స్, వ్యూస్ కోసం ఈ మధ్యకాలంలో చాలామంది యువత తమ ప్రాణాలు పొగొట్టుకున్నసందర్భాలు లేకపోలేదు. కానీ వ్యూస్ కోసం ఏది పడితే అది చేసేవారికి ఇదొక స్ట్రాంగ్ హెచ్చరిక అన్నమాట.