Raj Tharun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రసన్న కుమార్ బెజవాడ తన కెరీర్ ప్రారంభం నుంచే మంచి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 2015లో వచ్చిన సినిమా చూపిస్తా మావా సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఆయన, ఆ తర్వాత నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే, పాగల్, ధమాకా, నా సామి రంగ వంటి చిత్రాలకు రచయితగా పని చేశాడు. తాజాగా మజాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రసన్న కుమార్, ఒక ఇంటర్వ్యూలో తన తొలి సినిమా హీరో రాజ్ తరుణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రాజ్ తరుణ్ పై ప్రసన్న కుమార్ కామెంట్స్
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ – “రాజ్ తరుణ్ బంగారం లాంటి మనిషి, చాలా మంచోడు. అతనితో నాకు చాలా మంచి స్నేహం ఉంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అతను పిలిచే ఒకరిద్దరులో నేనుంటాను, నేను పిలిచే ఒకరిద్దరులో అతనుంటాడు” అని చెప్పాడు. ఈ మాటలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాయి.
రాజ్ తరుణ్ వివాదాలు.. రూమర్స్
గత కొంతకాలంగా రాజ్ తరుణ్ గురించి అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. అతని ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ లావణ్య డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, ఆ తర్వాత రాజ్ తరుణ్ పై తీవ్ర ఆరోపణలు చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే రాజ్ తరుణ్, ఈ కారణంగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు.
ప్రసన్న కుమార్ సపోర్ట్.. రీ ఎంట్రీ షురూ?
రాజ్ తరుణ్‌కి ప్రస్తుతం వరుస ఫ్లాపులు వస్తుండడంతో కెరీర్ కష్టాల్లో ఉంది. అయితే, ఇలాంటి సమయంలో ప్రసన్న కుమార్ బెజవాడ “రాజ్ తరుణ్ తప్పు చేయడు, అతను మంచి వ్యక్తి” అని చెప్పడం అతనికి మళ్లీ మంచి మద్దతుగా మారిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరూ మరోసారి కలసి సినిమాలు చేస్తారా? అనే విషయంపై టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది.
ఫ్యూచర్‌లో కలిసేనా?
ఒకప్పటి సక్సెస్‌ఫుల్ కాంబో అయిన రాజ్ తరుణ్ – ప్రసన్న కుమార్ బెజవాడ మళ్లీ కలిసి సినిమా చేస్తే, రాజ్ తరుణ్ కెరీర్‌కు లైఫ్ ఇస్తుందా? అన్న ప్రశ్న సినీ ప్రేమికులను ఉత్కంఠకు గురి చేస్తోంది. ప్రస్తుతం రాజ్ తరుణ్ కొన్ని కొత్త కథలు వింటున్నాడని టాక్ వినిపిస్తుండగా, మరి ప్రసన్న కుమార్ తో కలిసి సినిమా చేస్తాడా? ఈ ఇద్దరూ కలిసి మరో హిట్ కొడతారా? అన్నది చూడాలి.