BigTV English

Snake Terror: పాము పగ.. ఒకే కుటుంబంలో పాము కాటుతో ముగ్గురు మృతి.. ఇంకా ఎవరెవరంటే..

Snake Terror: పాము పగ.. ఒకే కుటుంబంలో పాము కాటుతో ముగ్గురు మృతి.. ఇంకా ఎవరెవరంటే..

Family Killed in Snake Bite| చాలా సినిమాల్లో పాముల గురించి పాముల పగ గురించి కథలు చూస్తూ ఉంటాం. అలాంటి పాము పగ కథ గురించి తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో చెప్పుకుంటున్నారు. ఆ రాష్ట్రంలో ఒకే ఇంట్లోని ముగ్గురు కుటుంబ సభ్యులు ఒకే పాముకాటుతో చనిపోయారు.


పైగా గ్రామంలో మరో ఇద్దరిని కూడా ఆ పాము కాటేసింది. ఆ ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందినవారే. దీంతో గ్రామంలో నివసించే ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంత మందిని కాటేసిన పాము పట్టుకోవడంలో అటవీ శాఖ అధికారులు విఫలమవడంతో ఇదేదో పగ బట్టిన పాము అని గ్రామస్తులు అనుకుంటున్నారు. పాము భయంతో ఇళ్ల నుంచి చాలా మంది బయటికి రావడంలేదు.

Also Read: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?


వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అమ్‌రోహా జిల్లా గఢముక్తేశ్వర మండల సదర్ పూర్ గ్రామంలో కొన్ని రోజుల క్రితం ఒక ఇంట్లో రాత్రివేళ నిద్రపోతున్న ఒక మహిళ పూనమ్ (32).. ఆమె ఇద్దరు పిల్లలను (సాక్షి (11), తనిష్క్ (9) )ను ఒక పాటు కాటు వేసింది. దీంతో ఆ ముగ్గురూ నిద్రలోనే చనిపోయారు.

ఆ తరువాత మరుసటి అదే గ్రామంలో నివసించే ప్రవేష్ (35)ని కూడా పాము కాటేసింది. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రవేష్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఇది జరిగిన తరువాతి రోజు ప్రవేష్ భార్య ఇంట్లో నిద్రపోతుండగా.. పాముకాటుకు గురైంది. దీంతో ప్రస్తుతం ప్రవేష్ భార్య చావుబతుకుల్లో ఉందని తెలిసింది.

మూడు రోజుల్లో వరుసగా పాము కాటు ఘటనలు జరగడం.. పైగా ఈ ఘటనల్లో ముగ్గురు చనిపోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో గ్రామస్తులు సీరియస్ అయ్యారు. అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పాముని పట్టకోవడంలో విఫలమయ్యారు. పాము కాటు భయంతో రాత్రివేళ గ్రామస్తులు నిద్రపోవడంలేదని.. ప్రతిరోజు రాత్రి గ్రామంలో భద్రత కోసం కొందరు నిఘా పెట్టారు.

Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?

ఒంటరిగా చెట్లు, పొదల్లో వెళ్లకూడదని, రాత్రి వేళ ఇంట్లో నేలపై పడుకో కూడదని గ్రామ పెద్ద ప్రజలందరికీ హెచ్చరించారు. అయితే పాము కాటు గురించి పరిశీలించగా.. పాము కాటు ఘటనలు అర్ధరాత్రి గడిచిన తరువాతే జరిగాయి.

పగబట్టిన ఆడ పాము
గ్రామంలో చాలామంది మూఢనమ్మకాలను పాటిస్తున్నారు. ఈ పాము చాలా మహత్యం కలిగిందని.. తన మగతోడు కోసం వెతికే ఆడపాము అని కథలు అల్లేస్తున్నారు. ఆ ఆడపాము రాత్రివేళ అందరూ నిద్రించిన తరువాత మనిషి రూపం ధరించి పగబట్టినవారిని కాటేస్తోందని కొందరు గ్రామస్తులు చెప్పారు.

Also Read: ప్రేమికులపై యాసిడ్ దాడి చేసిన మహిళలు.. ఇద్దరూ వివాహితులే..!

మరోవైపు పాము కాటుతో ప్రజలు చనిపోతుండడంతో పోలీసులు పాముని పట్టుకునేందుకు స్నేక్ చార్మర్స్ ని సాయం తీసుకుంటున్నారు.

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×