EPAPER

Woman throws Acid on Lover: ప్రేమికులపై యాసిడ్ దాడి చేసిన మహిళలు.. ఇద్దరూ వివాహితులే..!

Woman throws Acid on Lover: ప్రేమికులపై యాసిడ్ దాడి చేసిన మహిళలు.. ఇద్దరూ వివాహితులే..!

Woman throws Acid on Lover| త్యాగానికి మారుపేరు ప్రేమ కానీ ఆ ప్రేమలో అసూయ, స్వార్థం కలగలిస్తే.. ఆ బంధం నిర్వీర్యమవుతుంది. ఇలాంటి ఒక ప్రేమ కథ ఉత్తర్ ప్రదేశ్ బరేలి నగరంలో జరిగింది. నగరంలోని ఒక భర్త చనిపోయిన మహిళ తనకంటే చిన్న వయసు యువకుడిని ప్రేమించింది. వారిద్దరూ కొనేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. వివాహం కూడా చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో యువకుడి తల్లిదండ్రులకు వారిద్దరి ప్రేమ గురించి తెలిసింది. బలవంతంగా ఆ యువకుడిని మరో యువతితో వివాహం నిశ్చయించారు. అయితే పెళ్లి జరుగుతున్న సమయంలో ఆ మహిళ వచ్చి యువకుడితో గొడవపడిది. ఆ తరువాత అతనిపై యాసిడ్ తో దాడి చేసింది.


వివరాల్లోకి వెళితే.. బరేలి నగరంలో నివసించే విమలా కుమారి అనే 44 ఏళ్ల మహిళ భర్త పదేళ్ల క్రితమే చనిపోయాడు. ఆమెకు ఒక 22 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే విమలా కుమారి 5 ఏళ్ల నుంచి సలీమ్ అనే 32 ఏళ్ల యువకుడితో సంబంధం పెట్టుకుంది. సలీమ్ కూడా ఆమెను ప్రేమించుకున్నాడు .కానీ సలీమ్ ఇంట్లో వారిద్దరి పెళ్లికొ ఒప్పుకోలేదు. పైగా సలీమ్ కు దుబాయ్ లో ఉద్యోగం కోసం వెళ్లిపోవాల్సివచ్చింది. ఇలా ఒక సంవత్సరం తరువాత సలీమ్ ఇండియాకు తిరిగి వచ్చినప్పుడు అతనికి మరో యువతితో పెళ్లి నిశ్చయించారు. సలీమ్ తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో సలీమ్ ఇష్టం లేకపోయినా పెళ్లికి ఒప్పుకున్నాడు.

Also Read:  వెబ్ సిరీస్ చూసి బాలుడి మర్డర్.. ప్రేమ కోసం హంతకురాలిగా మారిన ఎంబిబియస్ విద్యార్థిని


ఈ క్రమంలో బరేలి సమీపంలోని ఒక గ్రామంలో ఇటీవల సలీమ్ వివాహం జరుగుతుండగా.. కల్యాణ మండపానికి అనుకోకుండా విమలా కుమారి చేరుకుంది. అక్కడ పెళ్లికొడుకు గదికి వెళ్లి గొడవ చేసింది. సలీమ్ ఆమెకు ఎంత సర్దిచెప్పానుకున్నా విమలా కుమారి వినలేదు. దీంతో సలీమ్ ఆమెతో తనకు ఇక ఏ సంబంధం లేదని చెప్పాడు. ఇది విన్న విమలా కుమారి కోపంతో తన వెంట తీసుకువచ్చిన యాసిడ్ సలీమ్ పై విసిరింది. కానీ సలీమ్ తప్పించుకోగా ఆ యాసిడ్ అతని పిన్నిపై పడింది .

ఇది చూసిన సలీమ్ పక్కనే ఉన్న కత్తితో విమలాకుమారిపై దాడి చేశాడు. ఇదంతా చూసి సలీమ్ స్నేహితులు అడ్డుపడి పరిస్థితిని కంట్రోల్ చేశారు. పోలీసులకు సలీమ్ తల్లిదండ్రులు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరినీ అరెస్టు చేశారు.

ఇలాంటిదే మరో ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా నగరంలో జరిగింది. ఆగ్రాలో ఒక సూపర్ మార్కెట్ ఓనర్ అయిన హేమ శంకర్ షాపుకి ఆస్మా అనే యువతి రోజూ షాపింగ్ కోసం వచ్చేది. లేడి కస్టమర్ కాబట్టి హేమ శంకర్ ఆమెతో ఆప్యాయంగా మాట్లాడేవాడు. దీంతో ఆస్మా అతనితో ప్రేమలో పడింది. కానీ ఆస్మా కు అప్పటికే పెళ్లి అయింది. ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆస్మా తన భర్త నుంచి విడిపోయి జీవిస్తోంది. అయితే ఇటీవల హేమశంకర్ కు పెళ్లి కుదిరింది. ఈ విషయం హేమ శంకర్ స్వయంగా ఆస్మాకు తెలిపాడు.

ఇది విన్న ఆస్మా.. హేమశంకర్ తో కోపంగా మాట్లాడింది. తను ఇన్ని రోజులుగా హేమశంకర్ ను ప్రేమించానని చెప్పింది. అయితే హేమశంకర్ మాత్రం ఆమె తనకు మంచి కస్టమర్ మాత్రమేనని చెప్పాడు. ఆ తరువాత ఆస్మా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఒక యాసిడ్ బాటిల్ తీసుకొని సూపర్ మార్కెట్ వచ్చి హేమశంకర్ ముఖంపై దాడి చేసింది. దీంతో హేమశంకర్ ముఖానికి యాసిడ్ వల్ల గాయాలయ్యాయి. యాసిడ్ దాడి చేసిన వెంటనే ఆస్మా అక్కడి నుంచి పారిపోయింది. అయితే పోలీసులు ఆమె ఫోన్ నెంబర్ ను ట్రాక్ చేసి పట్టుకున్నారు. హేమశంకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Also Read: ‘ఉద్యోగం కావాలంటే బాస్ తో సమయం గడపాలి’.. మహిళకు కండిషన్ పెట్టిన మేనేజర్

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×