Vijay Deverakonda:రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చివరిగా శివా నిర్వాణ(Siva Nirvana) దర్శకత్వంలో సమంతా (Samantha) హీరోయిన్ గా, విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఖుషి (Kushi) సినిమా పర్వాలేదనిపించుకుంది. ఆ తర్వాత ఈయన చేసిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఖుషీ సినిమాకి ముందు పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్ ‘ లైగర్’ అనే పాన్ ఇండియా సినిమా చేసి భారీ డిజాస్టర్ ను చవిచూశారు. ఇలా వరుసగా డిజాస్టర్ చూస్తున్న విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri). దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘కింగ్ డమ్’ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్నారు విజయ్ దేవరకొండ.
రాయలసీమ రౌడీ జనార్దన్ గా విజయ్ దేవరకొండ..
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ను త్వరలో అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవి కిరణ్ కోలా (Ravikiran kola) దర్శకత్వంలో ‘రౌడీ జనార్దన్’ (Rowdy Janardhan )అనే టైటిల్ తో విజయ్ దేవరకొండ కొత్త మూవీ చేయబోతున్నట్లు సమాచారం. రాయలసీమ నేపథ్యంలో నడిచే పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dilraju) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది అనగా 2026 లో రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Aishwarya Rai – Abhishek: విడాకులపై క్లారిటీ.. భర్తతో కలిసి అలాంటి పని చేసిన ఐశ్వర్య..!
విజయ్ దేవరకొండ కెరియర్..
‘నువ్విలా’ అనే సినిమా ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రతో ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్ దేవరకొండ.. 2012లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో చిన్న పాత్ర పోషించారు. 2015లో నాని (Nani) హీరోగా వచ్చిన ‘ ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాల్లో ఫుల్ లెంగ్త్ పాత్ర పోషించి.. రిషీ పాత్రతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.. ఇక తర్వాత 2016 లో వచ్చిన పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ. ఇక 2017 మొదట్లో ‘ద్వారకా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయారు. దాంతో ‘రౌడీ హీరో’ అనే ట్యాగ్ కూడా ఆయనకు లభించింది. ఇకపోతే అర్జున్ రెడ్డి తర్వాత ‘గీతాగోవిందం’ సినిమాతో ఫ్యామిలీ హీరోగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఇక ఈ చిత్రాల తర్వాత మళ్లీ ఆయన కెరియర్ లో ఇప్పటివరకు అలాంటి హిట్ పడలేదని చెప్పవచ్చు. మరి ఇప్పుడు రాబోయే ఈ చిత్రాలతోనైనా అలాంటి సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.