AP News : మాయమై పోతున్నడమ్మో మనిషన్న వాడు. కొందరు మనుషులు మృగాలుగా మారుతున్నారు. ఉన్మాదంతో దారుణాలకు తెగబడుతున్నారు. హత్యలు, అత్యాచారాల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భర్తను చంపడం.. భార్యను చంపడం.. లవర్‌ను చంపడం.. తల్లిదండ్రులను చంపడం.. పసివాళ్లను చంపడం.. ఇలా రోజుకో టైప్ కిరాతకాలే. ఏదో ఆవేశంలో చంపుతున్నారేమో అనుకోవడానికి కూడా లేదు. చంపేసి.. ఎంచక్కా బాడీని ముక్కలు ముక్కలుగా నరికేసి.. సూటుకేసుల్లో సర్దేస్తు్న్నారు కొందరు. ఉన్మాదం కాకపోతే ఏంటి ఇది? ఒకడైతే.. ముసలి ఇంటి ఓనర్‌ను చంపేసి.. ఆమె శవంపై డ్యాన్స్ చేసి సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. వీళ్లు అసలు మనుషులేనా?
కూతురుపై తండ్రి అత్యాచారం
ఇక, పసిపాపలపై అఘాయిత్యాలకు లెక్కే లేకుండా పోతోంది. ఐదేళ్ల లోపు బాలికలను కూడా వదలట్లేదు కామాంధులు. ఎంత కఠిన శిక్షలు విధిస్తున్నా దుర్మార్గుల్లో భయం పుట్టట్లేదు. నేరాలు, ఘోరాలు ఆగట్లేదు. అలాంటిదే ఇంకో దారుణమైన ఘటన విశాఖ జిల్లా భీమిలి తగరపువలసలో జరిగింది. కన్న కూతురుపైనే అత్యాచారం చేశాడు ఓ తాగుబోతు తండ్రి. వాడిని అసలు తండ్రి అనాలా? వావి వరసలు లేని కుక్క అనాలా?
తండ్రి కాదు వాడు సైతాన్
వాడి పేరు అప్పన్న. షిప్పింగ్ యార్డు ప్రాంతంలో ఉంటాడు. మంగళవారం రాత్రి ఫుల్‌గా మందుకొట్టాడు. మద్యం మత్తులో ఒళ్లు తెలీకుండా పోయాడు. అతడికో మైనర్ కూతురు ఉంది. బాధ్యతగా చూసుకోవాల్సిన తండ్రే బరితెగించాడు. కనురెప్పలా కాపాడాల్సిన వాడే కాటేశాడు. కూతురని కూడా చూడకుండా కామంతో కళ్లు మూసుకుపోయాయి వాడికి. అర్థరాత్రి.. మద్యం మత్తులో.. మైనర్ కూతురిపై అత్యాచారం చేశాడు. ఆ చిన్నారి తండ్రి చేస్తున్న పని అర్థం కాక.. బాధతో ఏడ్చింది. గట్టిగా అరిచింది. స్థానికులు ఆ బాలిక అరుపులు విని.. అక్కడ జరుగుతున్న దారుణాన్ని అడ్డుకున్నారు. ఆ కసాయి తండ్రి అప్పన్నను చితక్కొట్టి.. పోలీసులకు అప్పగించారు.
Also Read : భర్త గొంతు కోసిన మహిళా యూట్యూబర్
మైనర్ బాలికను చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని మహిళా ఏసీపీ పెంటారావు పరిశీలించారు. నిందితుడు అప్పన్నపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.