Sandeep Reddy vanga : బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలు రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. ఏ సినిమా చేసినా కూడా అది పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. అయితే ప్రభాస్ చేస్తున్న అన్ని ప్రాజెక్ట్స్ కంటే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఒక సిన్సియర్ కాప్ రోల్ లో కనిపించబోతున్నట్లు చాలా సందర్భాల్లో సందీప్ రెడ్డివంగా చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వరు బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 70% ఈ సినిమాకి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కంప్లీట్ అయింది అయితే ఈ సినిమా గురించి ప్రభాస్ కు పలు కండిషన్స్ పెడుతున్నాడు సందీప్ రెడ్డి వంగ.
ప్రభాస్ కు కండిషన్స్
ఈ సినిమాను మొత్తం 120 రోజుల్లో పూర్తి చేయనున్నారు. దీనిలో 90 రోజులు ప్రభాస్ డేట్స్ కావలసి ఉంది. అయితే ఈ 90 రోజులు కూడా ఏకధాటిగా ఈ సినిమా కోసమే కంటిన్యూ చేయాలి. ఈ సినిమా చేస్తున్న తరుణంలో మరో సినిమాకు డేట్స్ ఇవ్వకూడదు, అలానే షూటింగ్లో పాల్గొకూడదు అని సందీప్ రెడ్డివంగా కండిషన్ పెట్టారు. అంతేకాకుండా డైట్ అండ్ జిమ్ పర్ఫెక్ట్ గా చేసి బాడీ షేప్ ను కరెక్ట్ గా ఉంచాలి అని చెప్పారట. ప్రభాస్ చేస్తున్న మిగతా సినిమాలన్నిటికంటే స్పిరిట్ సినిమాలో ప్రభాస్ చాలా డిఫరెంట్ గా కనిపించాలి అని సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నాడు. సందీప్ రెడ్డివంగా ఎంత డెడికేటెడ్ గా ఉంటాడు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా గురించి సందీప్ రెడ్డి వంగ అస్సలు కాంప్రమైజ్ అవ్వడు.
సందీప్ పర్ఫెక్ట్ విజన్
అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ టాలెంట్ ఏంటో అందరికీ తెలిసిందే. చాలా విషయాల్లో సందీప్ రెడ్డి వంగాకి ఉన్న క్లారిటీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మామూలుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా అయిపోయిన తర్వాత చేస్తారు గాని సందీప్ రెడ్డి వంగ మాత్రం ముందుగానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్రియేట్ చేసి దానినిబట్టి సీన్ తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అలానే సినిమాటోగ్రాఫర్ కి లెన్స్ ఫ్రేమ్ కూడా సందీప్ రెడ్డివంగా కొన్నిసార్లు చెబుతూ ఉంటాడు. తనకు ఏం కావాలో అది తీసుకురావడానికి అస్సలు కాంప్రమైజ్ గాడు. అందుకనే సందీప్ రెడ్డి వంగ సినిమాలు టెక్నికల్ గా బ్రిలియంట్ అనిపిస్తాయి. ఇప్పుడు ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ సినిమాపై కూడా అంతటి అంచనాలే ఉన్నాయి. మరి ఆ సినిమాను సందీప్ రెడ్డి వంగ ఎలా డీల్ చేస్తాడో వేచి చూడాలి.
Also Read : Pooja Hegde : నాకు 30 మిలియన్లు ఫాలోవర్స్ ఉండొచ్చు, బట్ అది రియల్ వరల్డ్ కాదు