E-Paper
Advertisement

Burnsville Crime: అమెరికాలో అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి..?

Burnsville Crime: అమెరికాలో అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి..?
Advertisement

Burnsville Crime: అమెరికా బర్న్స్ విల్లేలో ఓ అపార్ట్‌మెంట్ కంప్లెక్స్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతిచెందినట్టు సమాచారం. బర్మింగ్‌హామ్ లోని అపార్ట్‌మెంట్ కంప్లెక్స్‌లో పది మంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నారు. అర్ధరాత్రి హఠాత్తుగా మంటలు చెలరేగటంతో విద్యార్థులు భయభ్రాంతులకు లోనయ్యారు. అగ్నిప్రమాదం మొదలైన కొద్దిసేపటికే దట్టమైన పొగ కమ్ముకుంది. దానితో ఊపిరి ఆడక విద్యార్థులు కేకలు వేసి ప్రాణభయంతో వణికిపోయారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. లోపల చిక్కుకుపోయిన మొత్తం 13 మంది విద్యార్థులను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్ చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతిచెందినట్టు తెలుస్తోంది.

Advertisement

మరణించిన వారిలో ఉడుముల సహజ రెడ్డి, కూకట్‌పల్లికి చెందిన ఇంకొక విద్యార్థి ఉన్నట్లు సమాచారం. వీరు అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్య చదువుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషాదకర ఘటనతో మృతుల కుటుంబాలలో తీవ్ర విషాదం అలుముకుంది. వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అమెరికాలో తెలుగు విద్యార్థులు చనిపోవడం రాష్ట్రంలో విషాద వాతావరణాన్ని సృష్టించింది.

ALSO READ: Minister Komatireddy: సీఎం చంద్రబాబును కలిసిన మంత్రి కోమటిరెడ్డి.. గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని పిలుపు

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×