E-Paper
Advertisement

బెంగళూరులో దారుణం.. పసికందు గొంతు కోసిన 19 ఏళ్ల కన్నతల్లి!

బెంగళూరులో దారుణం.. పసికందు గొంతు కోసిన 19 ఏళ్ల కన్నతల్లి!
Advertisement

Bengaluru: బెంగళూరు శివార్లలోని ఫాక్స్‌కాన్ ఐఫోన్ తయారీ ప్లాంట్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగు చూసింది. కేవలం 19 ఏళ్ల వయసున్న యువతి, సమాజానికి భయపడి తాను కన్న పేగు బంధాన్నే తెంచేసుకోవడం అత్యంత విషాదకరం. పెళ్లి కాకుండా గర్భం దాల్చానన్న విషయం బయటపడితే పరువు పోతుందన్న ఆందోళన ఆమెను ఒక రాక్షసిలా మార్చేసింది.

బుధవారం డ్యూటీలో ఉన్న సమయంలోనే ఆమెకు నొప్పులు రావడంతో, ఎవరికీ అనుమానం రాకుండా వాష్‌రూమ్‌లోకి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ పసికందు ఏడుపు వినిపిస్తే ఎక్కడ దొరికిపోతానో అన్న భయంతో, కనికరం లేకుండా ఆ బిడ్డ గొంతు కోసి చంపేసింది. అనంతరం ఆ మృతదేహాన్ని ఒక బ్యాగులో పెట్టి అక్కడే వదిలేసి ఏమీ తెలియనట్టు బయటకు వచ్చింది. కానీ తోటి మహిళా ఉద్యోగి వాష్‌రూమ్‌కు వెళ్లడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

Advertisement

ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. యువతి గర్భవతి అన్న విషయం తోటి ఉద్యోగులకు గానీ, యాజమాన్యానికి గానీ తెలియకుండా ఆమె జాగ్రత్త పడిందని తెలిపారు. ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు ఆమెపై హత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. లోకం ఏమనుకుంటుందో అన్న భయం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడమే కాకుండా, ఒక యువతి జీవితాన్ని జైలు పాలు చేసింది.

Also Read: రెండేళ్ల పగ.. టీచర్ ను రాడ్డుతో కొట్టిన స్టూడెంట్

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×