Step Mother Abuse Teenager| మహిళలపై జరుగుతున్న అత్యాచారాల కేసుల్లో ఎక్కువ శాతం వారి బంధువులు, లేదా పరిచయస్తులే నేరస్తులుగా తేలుతున్నారని జాతీయ క్రైం నివేదికలు ద్వారా తెలుస్తోంది. తాజాగా ఒక 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో అదే నిజమైంది. బాలికపై అత్యాచారం చేసిన కేసులో పోలీసులు అయిదుగురిని అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో బాలిక తల్లి ప్రమేయం కూడా ఉందని తేలడం పోలీసులు సైతం ఖంగుతిన్నారు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బిహార రాజధాని పట్నాలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో పాటలీపుత్ర అపార్ట్‌మెంట్స్ అనే గేటెడ్ కమ్యూనిటి ఉంది. అక్కడ కార్ పార్కింగ్ లో ఒక 15 ఏళ్ల బాలిక అపస్మారక స్థితిలో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు. ఆ అమ్మాయి గురించి ఆరా తీస్తే.. పాటలీపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో పనిమనిషిగా ఉద్యోగం చేస్తున్న మహిళ కూతురు.. ఆమెతో పాటు అప్పుడప్పడూ అక్కడికి వచ్చేదని తెలిసింది.
Also Read: బ్యాంకులో దొంగతనం చేసి పరార్.. దేశమంతా స్వామిజీగా జల్సా.. 20 ఏళ్ల తరువాత ఎలా చిక్కాడంటే..
దీంతో పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులను సంప్రదించారు. అయితే ఇక్కడే పోలీసులకు అనుమానం కలిగింది. ఆ అమ్మాయి తండ్రి రెండు వివాహాలు చేసుకున్నాడు. బాధితురాలు మొదటి భార్య కూతురు కానీ ఆ అపార్ట్‌మెంట్స్‌లో పనిమనిషిగా ఉద్యోగం చేసేది రెండో భార్య. అంటే ఆమె సవతి తల్లి. పోలీసులు ఆమెను ప్రశ్నించగా.. తనను అనారోగ్యంగా ఉండడంతో తన కూతురిని పనికోసం పంపంచానని తెలిపింది. కానీ అమ్మాయి అసలు తల్లి మాత్రం దీనికి భిన్నంగా తీవ్ర ఆరోపణలు చేసింది. తన కూతురి చేత వ్యభిచారం చేయించాలని గతంలో సవతి తల్లి ప్రయత్నించిందని.. కానీ అందుకు తాము ఒప్పుకోకపోలేదని తెలిపింది. ఇప్పుడు బాలికపై గ్యాంగ్ రేప్ జరగడానికి కూడా సవతి తల్లే కారణమని ఆరోపించింది.
గ్యాంగ్ రేప్ కు గురైన టీనేజ్ అమ్మాయి జననంగాల్లో కూడా గాయాలు కావడం.. ఆమెకు తీవ్ర రక్త స్రావం అయిందని వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉంది. అయితే పోలీసులు అపార్ట్‌మెంట్స్ లో ఏ ఫ్లాట్ లో అత్యాచారం జరిగిందో సిసిటీవి వీడియో ద్వారా తెలుసుకున్నారు. టీనేజర్ పై పాటలీపుత్ర అపార్ట్‌మెంట్స్ లో నివాసం ఉండే ఒక ట్రావెట్ ఏజెంట్ ఫ్లాట్ లో అత్యాచారం జరిగిందని.. అయితే ఆ ట్రావెట్ ఏజెంట్ పరారయ్యాడని.. తెలిసింది. కానీ పోలీసులు అతని మొబైల్ లొకేషన్ ట్రాక్ చేసి పట్టుకున్నారు. విచారణలో నిందితుడు తనతో పాటు మరో నలుగురు ఉన్నారని తెలిపాడు. పైగా అమ్మాయి సవతి తల్లి తమ వద్ద డబ్బులు తీసుకొని ఈ పని చేసిందని.. తాము అత్యాచారం చేయలేదని.. వాదించాడు.
పోలీసులు ట్రావెల్ ఏజెంట్ తో పాటు అత్యాచారం చేసిన మిగతా నలుగురిని కూడా అరెస్ట్ చేసి వారిపై పోక్సో కేసు నమోదు చేశారు. మరోవైపు అత్యాచార బాధితురాలి సవతి తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ఈ కేసు విచారణ కొనసాగుతోంది.