E-Paper
Advertisement

జర్మనీ గురుద్వారాలో దారుణం.. కత్తులతో బీభత్సం, 11 మందికి తీవ్ర గాయాలు

జర్మనీ గురుద్వారాలో దారుణం.. కత్తులతో బీభత్సం, 11 మందికి తీవ్ర గాయాలు
Advertisement

జర్మనీలోని మోయెర్స్ నగరంలో గల ఒక గురుద్వారాలో జరిగిన హింసాత్మక ఘర్షణ అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. దుయిస్‌బర్గ్ సమీపంలోని ఈ మతపరమైన ప్రదేశంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  భక్తులు ప్రార్థనల్లో ఉండగానే ఒక్కసారిగా దాడులు మొదలయ్యాయి.

దాదాపు 40 మంది ఈ గొడవలో పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. పరిస్థితి చేయి దాటడంతో జర్మన్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక పోలీసుల దళాలను సైతం అక్కడికి రప్పించాల్సి వచ్చింది. పోలీసులు వివరాల ప్రకారం.. ఈ ఘర్షణలో కేవలం పిడిగుద్దులే కాకుండా కత్తులు, కిర్పానలు వంటి పదునైన ఆయుధాలను వాడారు. పెప్పర్ స్ప్రే చల్లడంతో పాటు తుపాకీతో కాల్పులు జరిపినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఘటనా స్థలంలో బుల్లెట్ షెల్స్ లభించడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

Advertisement

ఈ రక్తపాతానికి ప్రధాన కారణం గురుద్వారా పాలకమండలి ఎన్నికలని తెలుస్తోంది. కొత్త బోర్డు సభ్యుల ఎంపిక విషయంలో రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. దీనికి తోడు గురుద్వారా నిధుల నిర్వహణపై కూడా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఏ వర్గం చేతిలో నిధులు ఉండాలి? ఎవరికి నిర్ణయాధికారం ఉండాలి? అనే అంశాలే ఈ దాడులకు పురిగొల్పినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఆకస్మికంగా జరిగిన గొడవ కాదని.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం ఉదయం ప్రార్థనలు మొదలయ్యే కొద్దిసేపటి ముందే దుండగులు పెప్పర్ స్ప్రేతో విరుచుకుపడ్డారు. ఆ వెంటనే ఒక వ్యక్తి పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. ప్రాణభయంతో భక్తులు ఆలయం బయటకు పరుగులు తీశారు. గాయపడిన వారికి పారామెడికల్ సిబ్బంది అక్కడే ప్రాథమిక చికిత్స అందించారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఇప్పటికే ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

ALSO READ: కన్నీళ్లు పెట్టుకున్న హేమా.. డ్రగ్స్ వ్యవహారంపై ఓపెన్ ఛాలెంజ్.. ‘బిగ్ టీవీ’తో ఏం చెప్పారంటే?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×