E-Paper
Advertisement

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 30 మందికి తీవ్ర గాయాలు

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 30 మందికి తీవ్ర గాయాలు
Advertisement

Bus Accident: అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి వద్ద 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు వేగంగా వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు బస్సు మూడు పల్టీలు కొట్టి, పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మొత్తంగా 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, వారిలో 13 మంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి క్షతగాత్రులను రక్షించే పనుల్లో నిమగ్నమయ్యారు.

Advertisement

తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం వెంటనే అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. లారీని తప్పించబోయే ఈ ఘోరం జరిగిందని ప్రయాణికులు కన్నీరుమున్నీరవుతూ చెబుతున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: బాడుదు మొదలైంది.. సీఎన్జీ ధరలు పెంపు, రెండువారాల్లో నాలుగోసారి

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×