E-Paper
Advertisement

నువ్వా మాట్లాడేది? పదో తరగతి పేపర్లు లీక్ చేసిన చరిత్ర నీది.. జగన్‌పై లోకేష్ ఫైర్

నువ్వా మాట్లాడేది? పదో తరగతి పేపర్లు లీక్ చేసిన చరిత్ర నీది.. జగన్‌పై లోకేష్ ఫైర్
Advertisement

Nara Lokesh: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మెగా డీఎస్సీపై చేసిన వ్యాఖ్యలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని, జాబ్ క్యాలెండర్ ఊసే లేకుండా యువతను వంచించారని లోకేష్ మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రికార్డు స్థాయిలో 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడమే కాకుండా, 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశామని గుర్తుచేశారు. త్వరలోనే మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని, జగన్ మరింత బిగ్గరగా ఏడవడానికి సిద్ధంగా ఉండాలంటూ ఎద్దేవా చేశారు.

పరీక్షల నిర్వహణపై జగన్ విమర్శలను తిప్పికొడుతూ.. పదో తరగతి పేపర్లు లీక్ చేసిన చరిత్ర ఉన్నవారే ఇతరులను దొంగలుగా భావిస్తారని లోకేష్ ధ్వజమెత్తారు. ఎంతో పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో అహర్నిశలు శ్రమించి, తమ ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16 వేల మంది అభ్యర్థులను జగన్ అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు సాధించిన వారందరికీ జగన్ వెంటనే లెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రాకుండా చేయడమే లక్ష్యంగా మెగా డీఎస్సీని ఆపడానికి జగన్ వర్గం కోర్టుల్లో దాదాపు 200 కేసులు వేయించిందని లోకేష్ ఆరోపించారు. అంతేకాకుండా గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి రాకుండా, పెట్టుబడులను అడ్డుకుంటూ యువత భవిష్యత్తును నాశనం చేయడానికి జగన్ కుట్రలు పన్నారని దుయ్యబట్టారు. ఇలా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న జగన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ క్షమించరని లోకేష్ స్పష్టం చేశారు.

Also Read: అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 30 మందికి తీవ్ర గాయాలు

Advertisement

Related News

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ బరిలో వంగవీటి రాధాకృష్ణ

పల్నాడులో హైటెన్షన్‌.. వైసీపీ కీలక నేతల హౌస్‌ అరెస్ట్‌.. ఆంక్షలపై రాజకీయ దుమారం!

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

Big Stories

Advertisement
×