E-Paper
Advertisement

Crime News: భార్య, పిల్లలను చంపి.. క్వార్టర్స్ పక్కనే పూడ్చిపెటి.. ఫారెస్ట్ అధికారి కిరాతకం!

Crime News: భార్య, పిల్లలను చంపి.. క్వార్టర్స్ పక్కనే పూడ్చిపెటి.. ఫారెస్ట్ అధికారి కిరాతకం!
Advertisement

మనుషులు రోజు రోజు మరింత కిరాతకంగా మారుతున్నారు. కట్టుకున్న వారిని, కడుపున పుట్టిన వారికి సైతం అత్యంత దారుణంగా చంపేస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ ప్రభుత్వ అధికారి ఏకంగా తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, వారి మృతదేహాలను పూడ్చిపెట్టాడు. ఏం తెలియదన్నట్లు తన భార్య పిల్లలు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. తాజాగా అసలు విషయం బయటకు రావడంతో పోలీసులు అసతడిని అరెస్ట్ చేశారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

గుజరాత్‌ లోని సూరత్ కు చెందిన అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శైలేష్ ఖంభాల తన భార్య, ఇద్దరు పిల్లలు తప్పిపోయినట్లు సుమారు 10 రోజుల క్రితం ఫిర్యాదు ఏశాడు. ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్యతో పాటు ఇద్దరు పిల్లలను కూడా ఆయనే చంపినట్లు గుర్తించారు. ముగ్గురు మృతదేహాలను భావ్‌ నగర్‌ లోని ఫారెస్ట్ కాలనీ సమీపంలోని పాతిపెట్టినట్లు గుర్తించారు. ఖాళీ స్థలం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. డాగ్ స్క్వాడ్‌ తో గాలింపు చేపట్టారు. పాతిపెట్టిన స్థలాన్ని గుర్తించి తవ్వగా.. శైలేష్ ఖంభాల భార్య, కుమార్తె, కుమారుడి మృతదేహాలు బయటపడ్డాయి.

ఈ ఘటనపై పోలీసులు ఏం చెప్పారంటే?

Advertisement

నవంబర్ 7న ఫారెస్ట్ అధికారి శైలేష్ తన భార్య, పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడని భావ్‌నగర్ పోలీసు సూపరింటెండెంట్ నితేష్ పాండే తెలిపారు. “పోలీసులు విస్తృతంగా గాలింపులు జరిపారు. కానీ, కుటుంబ సభ్యులను గుర్తించలేదు. నిందితుడు తన కుటుంబం సూరత్‌కు  ప్రయాణిస్తున్నట్లు సిసిటివి ఫుటేజ్‌లో చూపించిందని చెబుతూ దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించాడు. కానీ, అతడి తీరు మీద పోలీసులకు అనుమానం కలిగి, తమదైన శైలిలో విచారణ మొదలు పెట్టారు. అదే సమయంలో భావనగర్ లోని ఫారెస్ట్ క్వార్టర్స్ కు సమీపంలో ఏదో వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెళ్లి అక్కడ తవ్వగానే అతడి భార్య, పిల్లల మృతదేహాలు బయటపడ్డాయి. భార్యతో జరిగిన గొడవ కారణంగా ఆమెతో పాటు పిల్లలను చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు” అని పాండే తెలిపారు.

Read Also: కొండపైకి తీసుకెళ్లి.. తాళ్లతో కట్టేసి.. భార్యతో మాట్లాడినందుకు దారుణం!

Advertisement

భార్య, పిల్లల హత్య కేవలం కుటుంబ గొడవలే కాదు, ఇంకా ఏవో బలమైన కారణాలు ఉండి ఉంటాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే శైలేష్ ను అరెస్ట్ చేసినట్లు చెప్పిన భావ్‌నగర్ పోలీసు సూపరింటెండెంట్ నితేష్ పాండే.. త్వరలో తనను కస్టడీకి తీసుకుని పూర్తి వివరాలను రాబట్టనున్నట్లు తెలిపారు. అటు మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించినట్లు వెల్లడించారు.

Read Also:  నా భార్యకు నా కంటే కుక్కలే ఇష్టం.. విడాకుల కోసం కోర్టుకెక్కిన భర్త!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×