E-Paper
Advertisement

Tirupati Crime: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. హోటల్‌ రూమ్‌కు వెళ్లిన యువతి, యువకుడిపై కేసు

Tirupati Crime: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. హోటల్‌ రూమ్‌కు వెళ్లిన యువతి, యువకుడిపై కేసు
Advertisement

Tirupati Crime: తిరుపతిల నగరంలోని ఓ యువతిపై జరిగిన అఘాయిత్యం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేవలం సోషల్ మీడియా పరిచయాన్ని ఆసరాగా చేసుకుని.. మాయమాటలతో నమ్మించి ఓ యువకుడు 19 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

పోలీసుల సమాచారం ప్రకారం.. తిరుపతి రూరల్ మండలానికి చెందిన 19 ఏళ్ల యువతికి, కడప జిల్లాకు చెందిన ఓ యువకుడితో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటలు పెరిగాయి. సదరు యువకుడు ఆ యువతిని నమ్మించి, పథకం ప్రకారం అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్ర నగర్‌లో ఉన్న టౌన్ హౌస్ హోటల్‌కు పిలిపించాడు. అక్కడ హోటల్‌లోని రూమ్ నెంబర్ 114లో ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

Advertisement

బాధిత యువతి ఈ విషయాన్ని తన తల్లికి వివరించడంతో.. ఇద్దరూ కలిసి అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు ఘటన జరిగిన హోటల్ గదిని సందర్శించారు. క్లూస్ టీమ్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. నిందితుడు కడపకు చెందినవాడిగా గుర్తించిన పోలీసులు, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అలిపిరి సీఐ రామ్ కిషోర్ పర్యవేక్షణలో.. ఎస్సై శ్రీవాణి ఈ కేసును విచారిస్తున్నారు. పోలీసులు క్రైమ్ నెంబర్ 44/2026 కింద నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

Advertisement

ALSO READ: బీజేపీకి వారు దాసోహం.. మేము మాత్రం పోరాట వీరులం.. టీవీకే సైన్యంతో విజయ్ సమరభేరి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×