MP Crime News: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. సులువు డబ్బుల కోసం కక్కుర్తి పడ్డాడు. కట్నం తీసుకురావాలని నిత్యం భార్యను వేధించేవాడు. చివరకు క్రైమ్ సీరియల్ చూసి ఆ విధంగా భార్యను చంపేశాడు. పోస్టుమార్టం నివేదిక తర్వాత లోగుట్టు బయటపడింది. చివరకు పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్లొద్దాం.
క్రైమ్ సీరియల్ ప్రభావం
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సిటీకి చెందిన వ్యక్తి ప్రదీప్ గుర్జార్. మూడేళ్ల కిందట పెళ్లి అయ్యింది. భార్యభర్తలతో తాపీగా జీవనం సాగేది. ఏం జరిగిందో తెలీదు. సునాయా శంగా డబ్బులు సంపాదించాలని భావించాడు. ఎందులో చేయి వేసినా కన్నీళ్లు తప్పితే.. చిరునవ్వు కనిపించలేదు. దొరికిన దగ్గర అప్పులు చేశాడు. జల్సాలకు అలవాటు పడిన ప్రదీప్, కట్నం కోసం భార్యను వేధించేవాడు.
భార్యను చంపేసి, ఆపై యాక్సిడెంట్‌గా
ఖాళీగా ఉండే సమయంలో క్రైమ్ టీవీ షోలు చూసేవాడు. క్రైమ్ సీరియల్ ప్రభావంతో భార్యను చంపేసి మృతదేహాన్ని రోడ్డుపై పడేశాడు. రోడ్డు ఘటనలో తనకు గాయాలైనట్లు పోలీసులను నమ్మించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఆపై దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు. ప్రదీప్ భార్యను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ నివేదిక చూసి పోలీసులు షాకయ్యారు.
షాకిచ్చిన రిపోర్టు
రోడ్డు ప్రమాదంలో మహిళ చనిపోలేదని, చిత్ర హింసల వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్టులో బయటపడింది. దీంతో అనుమానంతో ఆమె భర్త ప్రదీప్‌ను పోలీసులు ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు.
ALSO READ: హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద పసికందు
కట్నం కోసం ప్రదీప్ తన భార్యను వేధించేవాడంటూ మృతురాలి బంధువులు ప్రధానంగా ఆరోపించారు. మ్యారేజ్ అయిన నుంచి ఇదే విధంగా వేధించేవాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు పోలీసులు, ప్రదీప్‌ను అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 12న షీట్లా రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మరణించినట్లు వార్తలు రావడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.