Nindu Noorella Saavasam Serial Today Episode : శివరాం ఆరు రూంలోని కప్‌బోర్డు సర్దుతుంటే.. అనామిక హెల్ప్ చేస్తుంది. కప్‌బోర్డు మొత్తం క్లీన్ చేస్తుంది. తర్వాత వస్తువులు మొత్తం ఇస్తే కప్‌బోర్డులో సర్దుతానని చెప్తుంది. దీంతో శివరాం ఆరు చీరలు తీసి ఇవ్వబోతుంటే కంగారుగా మనోహరి పరుగెత్తుకొస్తుంది. ఆగు ఆగు అంటూ వచ్చి అనామికను తిడుతుంది. దీంతో శివరాం ఏమైందమ్మా ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతాడు. మనోహరి మాత్రం ఏం చేస్తున్నావు. ఆరు వస్తువులు ముట్టుకోవద్దని నీకు చెప్పాను కదా..? అంటుంది. దీంతో అనామిక అంకుల్ చెప్తే వచ్చానండి అంటుంది. ఎవరు చెప్పినా ఏం చెప్పినా ముట్టుకోవద్దని నీకు మరీ మరీ చెప్పినా ఇంకా ముట్టుకుంటుంటే ఏమనాలి..? అంటూ అరుస్తుంది. దీంతో శివరాం ఇప్పుడు ఏమైందని అమ్మా ఆ అమ్మాయి మీద అలా అరుస్తున్నావు అంటాడు.
ఇంతలో అక్కడకు వచ్చిన నిర్మల అయినా ఈ అమ్మాయి మా అరుంధతి వస్తువులు ఎందుకు ముట్టుకోకూడదు అని ప్రశ్నిస్తుంది. దీంతో మనోహరి షాక్ అవుతుంది. అనామిక కూడా ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అండి ఎందుకు మీరు నన్ను అరుంధతి మేడం వస్తువులు ముట్టుకోనివ్వడం లేదు అని అడుగుతుంది. దీంతో మనోహరి కూల్‌గా అమర్‌కు ఆరు వస్తువులు ఎవ్వరూ ముట్టుకోవడం ఇష్టం ఉండదు కదా అంకుల్. అమర్ వాటిని ఎంత ప్రేమగా చూసుకుంటాడో మీకు తెలుసు కదా..? ఈ అమ్మాయి తెలిసో తెలియకో వాటిని పాడు చేస్తే అమర్ మనసు బాధపడుతుంది. ఈ అమ్మాయి మీద అరుస్తాడు అందుకే ముట్టుకోవద్దు అన్నాను అని చెప్పగానే శివరాం.. నువ్వు చెప్పింది కూడా కరెక్టే అమ్మా.. అమ్మా అనామిక ఇవన్నీ మేము చూసుకుంటాము కానీ నువ్వు వెళ్లు అంటాడు.
సరే అంకుల్ అని అనామిక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అన్ని తీసి బయట పెట్టాను ఇప్పుడు ఇవన్నీ ఎవరు సర్దాలి అంటాడు శివరాం. దీంతో మనోహరి నేను ఉన్నాను కదా అంకుల్ నేను సర్దుతాను. అని చెప్పి మనోహరి సర్దుతూ.. కిందపడిపోతుంది. చేతిలో ఫైల్స్ కింద పడిపోతాయి. ఫైల్స్ సర్దుతూ.. అందులోని బర్తు సర్టిఫికెట్స్ చూస్తుంది. అందులో అంజు సర్టిఫికెట్ లేదని అడగ్గానే.. శివరాం.. ఇవన్నీ నేను సర్దుతాను ఇక నువ్వు వెళ్లు మనోహరి అని పంపిచివేస్తాడు. మనోహరి వెళ్లిపోగానే.. శివరాం, నిర్మల ఆ ఫైల్ ను తమ గదిలోకి తీసుకెళ్తారు. అంతా మనోహరి గమనిస్తుంది. ఆ ఫైల్ చూడగానే వాళ్ల బిహేవియరే మారిపోయింది. ఆ ఫైల్ లో ఎవ్వరూ చూడకూడనంత ఏముంది. అసలు ఈ ముసలోళ్లు ఎందుకు ఇంత కంగారు పడ్డారు. అదేదో అంజుకు సంబంధించింది అని అర్థం అయింది. అంజు గురించి వీళ్లు ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది అనుకుంటుంది.
తర్వాత పిల్లలందరూ కలిసి తాము స్కూల్ యానివల్ డే స్పోర్ట్స్ లో పాల్గొంటామని అడుగుతుంది. అందరితో గొడవకు దిగుతుంది. దీంతో నిర్మల ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా..? ఇప్పుడు గేమ్స్ ఏంటి..? ఎగ్జామ్స్ అయిపోయాక ఆడుకోండి అని చెప్తుంద. శివరాం కూడా యానివల్ డే గేమ్స్‌కు మీకు పర్మిషన్ లేదు డిస్కషన్ ఈజ్ ఓవర్ అని చెప్తాడు. దీంతో అమ్ము మెల్లగా మిస్సమ్మ దగ్గరకు వెళ్లి మిస్సమ్మ నువ్వైనా తాతయ్యను కన్వీన్స్ చేయ్ ఫ్లీజ్ అని అడుగుతుంది. మీరు గేమ్స్ లో పడి స్టడీస్‌ను నెగ్లెక్ట్ చేయమని చెబితే కన్వీన్స్ చేస్తాను అంటుంది మిస్సమ్మ. అలా ఏం చేయమని అమ్ము చెప్తుంది. మీ మీద కాదు ఇక్కడ కొంత మంది మీద ఆ డౌటు ఉంది అని మిస్సమ్మ చెప్పగానే.. అంజు కోపంగా నువ్వనేది నన్నే కదా సరే డాడీ వచ్చాక డాడీతో పర్మిషన్ తీసుకుంటాను అంటూ వెళ్లిపోతుంది.
తన రూంలోకి తీసుకెళ్లిన ఫైల్‌న పట్టుకుని శివరాం. ఈ ఫైల్ ఇక్కడే ఉంటే ఎవరైనా చూసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది అమర్ రూంలో ఉండటమే కరెక్ట్ అనుకుని మిస్సమ్మను పిలిచి ఆ ఫైల్ ఇస్తాడు. ఈ ఫైల్ అమర్ కు ఇచ్చి జాగ్రత్తగా పెట్టమని చెప్పు అని చెప్పగానే సరే మామయ్య అంటూ ఫైల్ తీసుకుని అమర్ రూంలోకి వెళ్లిన మిస్సమ్మ అక్కడ అమర్ లేకపోయే సరికి కప్‌బోర్డులో పెడదాం ఆయన వచ్చాక చెబుదాం అనుకుని ఫైల్ కప్‌బోర్డులో పెట్టబోతుంటే కింద పడిపోతుంది. అందులో పేపర్స్ అన్ని చెల్లాచెదురుగా పడటంతో ఒక్కో పేపరు తీసి ఫైల్ లో పెడుతూ అంజలిని దత్తత తీసుకున్న సర్టిఫికెట్ చూస్తుంది మిస్సమ్మ. దీంతో మిస్సమ్మ షాక్ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?