Illu Illalu Pillalu Today Episode March 18th : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ తన భర్త ధీరజ్ అన్న మాటలు, రామారాజు అన్న మాటలు తలచుకొని బాధ పడుతుంది. వాళ్ళ అన్న వాడిని వాడిని వదిలేసి మన ఇంటికి వచ్చేయి. నువ్వు అక్కడ కష్టపడటం ఇంట్లో వాళ్ళు చూడలేకపోతున్నారు. ఇంత బతుకు బతికి హోటల్లో ఎంగిలికప్పులు వెతుక్కోవడం ఏంటి ప్రేమ నిన్నే రోజేనా మిమ్మల్ని చూసామా అని చెప్తాడు. తనకి ప్రేమ తన అన్నకు నిజం చెప్పలేక తన అన్న మాటలు వినలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది. ప్రేమ తన మనసులోని బాధను ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా కూర్చోని బాధపడుతుంది. ఎందుకు ప్రేమ భాద పడుతున్నావు అని నర్మదా అడుగుతుంది. నేను ఒక నిజాన్ని దాచి అటు మా ఇంటి వాళ్లకి ఇటు వీళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తాను. ఆ నిజాన్ని చెప్పలేక నాలో నేను కుమిలి పోతున్నాను ఇది ఎక్కడికి వెళ్తుందో నాకు అర్థం కావట్లేదని ప్రేమ బాధపడుతూ ఉంటుంది.
అటు భాగ్యం శ్రీవల్లి పెళ్లిని ఎలాగైనా రామరాజు చేతనే చేయించాలి అని అనుకుంటుంది. గుడిలో లగ్న పత్రిక రాయించడానికి రామరాజు ఫ్యామిలీ అటు భాగ్యం ఫ్యామిలీ ఇద్దరు గుళ్లోకి వస్తారు. ఇక శ్రీవల్లి లాంటి మంచి అమ్మాయి మనకెందుకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని రామరాజు అంటారు. ఇక భాగ్యం పెళ్లి అంతా వాళ్ళే చేసేలా ప్లాన్ చేస్తుంది. మా ఇంటి సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం పెళ్లి అమ్మాయి వాళ్ళు చేయించాలని రామరాజు అంటాడు. కానీ బుజ్జమ్మ మాత్రం పెళ్లి అమ్మాయి వల్లే చేయాలని అంటుంది ఇక భద్ర భాగ్యంకు పెళ్లికూతురుని ఇవ్వద్దని చెప్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. భద్ర చెప్పిన విషయాన్ని ఎలాగైనా రామ్ రాజ్ తో తెలుసుకోవాలని భాగ్యం అనుకుంటుంది. ఈ గుడ్డుని చేతిలో పెట్టుకొని పెళ్లి మొత్తం వాళ్లే చేసేలాగా ప్లాన్ చేస్తానని అనుకుంటుంది. భాగ్యం ఆమె భర్త రామ్ రాజు మిల్లు కి వెళ్తారు. మీరు ఈ విషయాన్ని ఎందుకు దాచారు నగల కోసమే అమ్మాయిని ట్రాప్ చేసి మీ చిన్నబ్బాయి పెళ్లి చేసుకున్నారు కదా మీరు కూడా అదే చేశారా ఏంటి అని అడుగుతుంది. వాళ్లకి మాకు పాత కక్షలు ఉన్నాయి. అందుకే వాళ్ళు మా గురించి లేనిపోనివి చెప్తున్నారని రామరాజు అంటాడు.. కానీ భాగ్యం మాత్రం తన ప్లాన్ వర్క్ అవుట్ అవ్వాలని అమ్మాయి కోసం నగల కోసం మీ చిన్నబ్బాయి మోసం చేసినట్టే మీ పెద్దబ్బాయి మోసం చేయడానికి నమ్మకమేంటి మేము ఈ పెళ్లి గురించి కాస్త ఆలోచించుకుని చెప్తామని అంటుంది.
వేదవతి మాత్రం తన కోడళ్ళకి చీరలు కొనాలని ఇంటికి చీరలు పిలిపిస్తుంది. అందరూ కలిసి చీరలు తీసుకోవాలని చూస్తూ ఉంటారు. నర్మదా అత్తపై సెటర్లు వేస్తూ ఉంటుంది. మావిచిగురుకాలం నటి చీరలు తీస్తే ఈరోజుల్లో అమ్మాయిలు ఎవరు ఒప్పుకోరు రెండుకు తగ్గట్టు చీరలు తీసుకోవాలి అని బుజ్జమ్మ పై సెటైర్లు వేస్తుంది. ఇక శ్రీవల్లికి చీరలు సెలెక్ట్ చేసిన విషయాన్ని చెందుతూ చెప్తుంది అయితే శ్రీవల్లి నెంబర్ ఉంటే ఆమెకు ఫోన్ చేసి ఇవ్వ లేకపోతే చీరల ఫోటోలు పెట్టు అని చెప్తుంది.
చందు చీరల ఫోటోలని శ్రీవల్లికి పెడతాడు కానీ శ్రీవల్లి రిప్లై ఇవ్వదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు ఏమైంది రా అంటే తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటాడు. ఏదైనా పనిలో ఉందేమోలే మళ్ళీ తనే చేస్తుందిలే చూసుకుంటే అని వేదవతి అంటుంది. ఇక నర్మదకు చీర సెలెక్ట్ చేసేస్తుంది అలాగే ప్రేమ కూడా ఒక చీర సెలెక్ట్ చేసి ఇస్తే నాకొద్దు అత్తయ్య ఇప్పుడున్నవి చాలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..
శ్రీవల్లి భాగ్యం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఈ పెళ్లి జరగదు అని తన భర్త చెప్తే శ్రీవల్లి టెన్షన్ పడుతుంది ఆలా ఎందుకు జరుగుతుంది గుడ్లు పెట్టే బాతుని ఒకేసారి పోసుకొని తింటామా అప్పుడప్పుడు వాడుకోవాల్సిందే అని భాగ్యం అంటుంది ఈ పెళ్లి మనల్ని చేయమని వేదవతి ఉంది కదా అన్ని వాళ్లే చేశాలా మనం చేద్దామని భాగ్యం అంటుంది. మాత్రం చెందూ పెళ్లి జరుగుతుందో లేదో అని టెన్షన్ పడుతూ ఇంటికి వెళ్తాడు. ధీరజ్ తన భార్య కోసం ఫుడ్ ని తీసుకొస్తాడు అది చూసి బుజ్జమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ప్రేమను వాళ్ళ అన్నయ్య కొడతాడు మధ్యలో రామరాజు వెళ్తే అతన్ని కొడతాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి..