Head Master Harassment: విద్యాబుద్దులు నేర్పించాల్సిన ప్రధానో పాధ్యాయుడు కామంతో కళ్లు మూసుకుపోయాడు. మహిళా విద్యార్థులపై వేధింపులకు దిగాడు. వారిని వస పరుచుకోవాలని భావించాడు. చివరకు సబ్బు, షాంపూలతో లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. అడ్డంగా బుక్కై సస్పెండయిన ఘటన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది.
రంప చోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో గిరిజన సంక్షేమశాఖ బాలికల ఆశ్రమ పాఠశాల ఉంది. అక్కడ ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు చుండ్రు రామకృష్ణ. ఇటీవల వరదల నేపథ్యంలో స్కూల్‌లో ఐదుగురు విద్యార్థులు ఉండిపోయారు. దీన్ని అలుసుగా తీసుకున్నాడు హెచ్ఎం.
డబుల్ మీనింగ్ మాటలాడుతూ ఆయా విద్యార్థులను లొంగదీసుకోవాలనే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ విద్యార్థులు లొంగలేదు. చివరకు సబ్బులు, షాంపూలతో వారిని లోబరుచుకోవాలని భావించాడు. వారితో అసభ్యకరంగా మాట్లాడడం మొదలుపెట్టాడు.
వరద తగ్గిన తర్వాత విద్యార్థుణులు ఇంటికి వెళ్లారు. జరిగినదంతా పేరెంట్స్‌కు తెలిపారు. ఈ వ్యవహారంపై స్థానికులతోపాటు గ్రామస్థులు మండిపడ్డారు. దుమారం రేగడంతో చివరకు ధర్నాకు దిగారు. ఈ విషయం ఐటీడీఓ అధికారి సింహాచలం దృష్టికి వెళ్లింది.
ALSO READ: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ
పరిస్థితి గమనించిన పైస్థాయి అధికారులు, వెంటనే రామకృష్ణను సస్పెండ్ చేశారు. విద్యార్థిణుల ఫిర్యాదుతో గంగవరం పోలీసుస్టేషన్‌లో ఫోక్స్ చట్టం కింద హెడ్ మాస్టారుపై కేసు నమోదు చేశారు పోలీసులు.
ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో వసతి గృహంలో ఉంటున్న విద్యార్థుణిలు వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అన్ని హాస్టల్స్‌పై ప్రత్యేక నిఘా పెంచినట్టు అధికారులు వెల్లడించారు.