Lover Knife Attack: ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లికి అంగీకరించలేదని ప్రియురాలిపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత లవర్ కూడా మెడ, చేతిపై కోసుకున్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఇరువురిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సంచలనం రేపిన ఈ ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది.
నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వలేటివారిపాలెం మండలం బంగారక్కపాలెంలో యువతిని ప్రేమించాడు రామకృష్ణ అనే యువకుడు. వీరిద్దరి మధ్య పరిచయం స్నేహానికి దారి తీసింది. ప్రేమలో పీకలోతుల్లోకి వెళ్లిపోయాడు.
రామకృష్ణ.. కన్నుమూసినా, తెరిసినా ఆమె కనిపించేది. చివరకు ఒక రోజు ప్రియురాలికి తన ప్రేమను చెప్పాడు. యువతి సైలెంట్ అయ్యింది. కొద్దిరోజుల తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చాడు. అందుకు ఆమె అంగీకరించలేదు.
ప్రియుడికి కోపం తన్నుకొచ్చింది. పగతో రగిలిపోయాడు. చివరకు ఉన్మాదిగా మారిపోయాడు ప్రియుడు రామకృష్ణ. ఆమెకి ఎలాగైనా చంపాలని నిర్ణయానికి వచ్చాడు. తనతో తెచ్చుకున్న కత్తితో ప్రియురాలి పై దాడి చేశాడు రామకృష్ణ.
ALSO READ: 5 ఏళ్ల పాప ప్రైవేట్ భాగాలు, నోటిపై వాతలు పెట్టిన మహిళ.. ఆ పాప ఏం చేసిందంటే?..
ప్రియురాలి లేని లోకంలో తాను ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో కత్తితో మెడ, చేతిపై కోసుకున్నాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలు, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరూ కోలుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు…
నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం బంగారక్కపాలెంలో పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై కత్తితో దాడి చేసిన రామకృష్ణ.
అనంతరం తానూ కత్తితో మెడ కోసుకున్న రామకృష్ణ.
ఇద్దరికీ తీవ్ర గాయాలు….ఆసుపత్రికి తరలింపు.… pic.twitter.com/mgFuGu855D
— BIG TV Breaking News (@bigtvtelugu) September 18, 2024