BigTV English
Advertisement

Actress : మరో బీ టౌన్ బ్యూటీ పాన్ ఇండియా ఎంట్రీ… ప్రభాస్, మహేష్ సినిమాలపైనే కన్ను

Actress : మరో బీ టౌన్ బ్యూటీ పాన్ ఇండియా ఎంట్రీ… ప్రభాస్, మహేష్ సినిమాలపైనే కన్ను

Actress : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు  పాన్-ఇండియన్ సినిమాలు చాలా సాధారణంగా మారాయి. ఇప్పటిదాకా కేవలం ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, యష్ వంటి స్టార్స్ మాత్రమే పాన్ ఇండియా మూవీ అంటూ సాహసం చేసి ఇప్పుడు తిరుగులేని స్టార్స్ గా ఇండియన్ సినిమా చరిత్రలో తమ పేర్లను లిఖించుకున్నారు. ఇక ఇప్పుడు చాలా మంది నటీనటులు ఈ విషయంలో ముందడుగు వేయడంతో పాటు ఒక్క ఛాన్స్ అన్నట్టుగా పాన్ ఇండియా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.  ఇప్పటికే హీరోయిన్లలో అనుష్క, అలియా భట్ వంటి వారు పాన్ ఇండియా హీరోయిన్లుగా మంచి పేరును సంపాదించుకున్నారు.  ఇక ఇప్పుడు జాన్వి కపూర్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. తాజా సమాచారం ప్రకారం మరో బీ టౌన్ బ్యూటీ కూడా ప్రభాస్ లేదా మహేష్ సినిమాలతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారే ఆలోచనలో ఉన్నట్టు టాక్ నడుస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో ఒక లుక్కేద్దాం పదండి.


ప్రభాస్, మహేష్ సినిమాలపై హిందీ హీరోయిన్ కన్ను

బాలీవుడ్ లఓ ఏజ్ తో సంబంధం లేకుండా బిజీగా ఉన్న హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు. ఇటీవలే క్రూ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ పాన్ ఇండియా సినిమాల వేటలో పడ్డట్టు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న పలు పాన్ ఇండియా డైరెక్టర్స్ ఆమె క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలఓ పడ్డట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వరుసలో ఉన్న రెండు భారీ అంచనాలున్న ప్రాజెక్ట్‌లలో భాగంగా కరీనా కపూర్ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇందులో రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న SSMB29 ఒకటి కాగా, రెండవది ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రనున్న స్పిరిట్. అయితే ఈ విషయంపై ఇంకా ఎటువంటి క్లారిటీ లేనప్పటికీ, ఆమె అభిమానులు మాత్రం తాజా రూమర్లు నిజం కావాలని కోరుకుంటున్నారు. మరి కరీనా చివరకు ఏ ప్రాజెక్ట్‌లో భాగమవుతుందనేది ఆసక్తికరంగా మారింది.


Kareena Kapoor Khan likely to make her pan-Indian debut; will it be Mahesh Babu’s SSMB 29 or Prabhas’ Spirit?

కన్నడ వద్దు తెలుగు ముద్దు 

నిజానికి చాలా రోజుల కిందటే కరీనా కపూర్ ఓ క్రేజీ కన్నడ సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వనుంది అనే వార్తలు వచ్చాయి. కన్నడ స్టార్ యష్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ టాక్సిక్‌లో కరీనా కపూర్ ఖాన్ భాగం కావాల్సి ఉంది. ఈ చిత్రంలో ఆమె యష్ సోదరి పాత్రలో నటిస్తుందని పుకార్లు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి కరీనా తప్పుకుంది. మూవీ మొత్తం డ్రగ్స్ నేపథ్యంలో రూపొందుతుండడంతో, లేని పోనీ చిక్కుల్లో పడే అవకాశం ఉందనే కారణంతో కరీనా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి.  తరువాత ఆమె పాత్రను లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఆఫర్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె తెలుగు స్టార్స్ అయిన ప్రభాస్, మహేష్ సినిమాలలో నటించనుంది అంటూ వార్తలు రావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×