E-Paper
Advertisement

Sangareddy Crime: రాష్ట్రంలో దారుణ పరువు హత్య.. ఇంటికి పిలిపించుకొని.. దారుణంగా కొట్టి చంపేశారు

Sangareddy Crime: రాష్ట్రంలో దారుణ పరువు హత్య.. ఇంటికి పిలిపించుకొని.. దారుణంగా కొట్టి చంపేశారు
Advertisement

Sangareddy Crime: ప్రేమ పేరుతో సమాజంలో రోజురోజుకీ దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. కులం, పరువు, అనుమానం, తల్లిదండ్రులకు ఇష్టం లేక ఇలాంటి కారణాలతో దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట దారుణ హత్యలు జరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాలతో ప్రాణాలను తీసుకునే స్థాయి వరకు వెళ్తున్నారు. ఓపికను కోల్పోయి దారుణంగా చంపుకుంటున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా బీరంగూడలో పరువు హత్య రాష్ట్రం వ్యాప్తంగా కలకలం రేపింది.  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. తమ కూతురును ప్రేమించిన నెపంతో ఇంజనీరింగ్ స్డూడెంట్ జ్యోతి శ్రావణ్ సాయి (20) ను అమ్మాయి తల్లిదండ్రులు దారుణంగా హత్య చేశారు. బీరంగూడ ఇసుకబావికి చెందిన శ్రీజ (19), జ్యోతి శ్రావణ్ సాయి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన శ్రీజ కుటుంబ సభ్యులు వారిద్దరినీ పలుమార్లు హెచ్చరించినా వారు ప్రేమను కొనసాగించారు.

Advertisement

మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ కాలేజీలో బీటెక్ సీఎస్‌ఈ సెకండ్ ఇయర్ చదువుతున్న జ్యోతి శ్రావణ్ సాయి కుత్బుల్లాపూర్‌లో రూం తీసుకుని నివాసం ఉంటున్నాడు. శ్రావణ్ సాయి, శ్రీజ ప్రేమను కంటిన్యూ చేయడంతో.. వారిద్దరికీ పెళ్లి చేస్తామని మాట్లాడదామనే సాకుతో జ్యోతి శ్రావణ్ సాయిని శ్రీజ కుటుంబ సభ్యులు ఇంటికి పిలిపించారు. శ్రీజ ఇంటికి వచ్చిన శ్రావణ్ సాయిపై కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దాడి చేశారు. రూంలో బంధించి రోజంతా చితకబాదారు. ఇష్టం వచ్చినట్టు శ్రావణ్ సాయిని కొట్టారు.

హత్యకు గురైన యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అమీన్‌పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారం చివరకు హత్యకు దారితీయడంతో బీరంగూడలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

ALSO READ: Viral News: భార్యతో గొడవ.. జేబులో చేతులు పెట్టుకుని 450 కి.మీలు నడుస్తూ వెళ్లిపోయిన భర్త!

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×