E-Paper
Advertisement

Sundeep Kishan: క్లాసుకు వెళ్లకపోయినా అటెండెన్స్, సందీప్ కిషన్ ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టరా?

Sundeep Kishan: క్లాసుకు వెళ్లకపోయినా అటెండెన్స్, సందీప్ కిషన్ ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టరా?
Advertisement

Sundeep Kishan: తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అని అంటూ ఉంటారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామందికి ఇది బాగా సూట్ అవుతుంది. దర్శకులుగా సినిమాలు చేయాలి అని కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం మొదలుపెడతారు. అయితే ఆ ప్రాసెస్ లో ఊహించిన విధంగా నటులుగా అయిపోతుంటారు. ఇకపోతే ఇండియన్ ఇండస్ట్రీలోనే చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లుగా కెరియర్ మొదలుపెట్టి నేడు నటులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు.

అలాంటి వాళ్ళ ప్రస్తావన వస్తే ముఖ్యంగా రవితేజ నాని వంటి హీరోల పేర్లు తెలుగులో వినిపిస్తాయి. కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవాడు రవితేజ. రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న తరుణంలోని నిన్ను హీరోను చేస్తాను అని పూరి జగన్నాథ్ పలు సందర్భాల్లో చెప్పాడు. రవితేజ దానిని పూర్తిస్థాయిలో నమ్మకపోయినా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఒక స్టార్ డం రవితేజకు పూరి జగన్నాథ్ క్రియేట్ చేశాడు.

Advertisement

ఇక నాని విషయానికొస్తే బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత ఇంద్రకంటి మోహన్ కృష్ణ చేసిన అష్టా చమ్మా సినిమాతో నటుడుగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు నాని ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు చాలామంది కొత్త దర్శకులను కూడా నాని పరిచయం చేస్తున్నాడు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా సందీప్

అయితే సందీప్ కిషన్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినట్లు రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిసింది. సందీప్ కిషన్ తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ ఉంటాడు. తెలుగులో కార్తీ ను ఎలా అయితే ఆదరించారో తమిళ్ లో తను కూడా ఆ స్థాయి ఆదరణ పొందాలి అని ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

Advertisement

చిన్నప్పటి నుంచి చెన్నైలో చదువుకోవటం వలన తమిళ మీద అవగాహన కూడా సందీప్ కు చాలా బాగా ఉంది. అయితే సందీప్ కాలేజ్ చదువుకుంటున్న టైం లోనే సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాకు తమిళ్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవారట. సందీప్ ఆ సినిమాకి పని చేస్తున్నప్పుడు కాలేజీకి వెళ్లకపోయినా కూడా అటెండెన్స్ మాత్రం 100% వేసే వాళ్ళట. మొత్తానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన సందీప్ ప్రస్తుతం హీరోగా కూడా మంచి గుర్తింపు సాధించుకున్నాడు.

అందుకే కొత్త దర్శకులతో 

మామూలుగా ప్రూవ్ చేసుకున్న దర్శకులు కంటే కూడా కొత్త దర్శకులు దగ్గర మంచి మంచి ఐడియాలు ఉంటాయి. అందుకనే కొత్త దర్శకులతో సందీప్ కిషన్ ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దేవకట్ట, లోకేష్ కనకరాజ్, మహేష్ బాబు వంటి కొత్త దర్శకులతో పనిచేశాడు సందీప్ కిషన్.

సందీప్ కిషన్ హీరోగా మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన రారా కృష్ణయ్య సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా కూడా, ఆ తర్వాత వచ్చిన మిస్సెట్టి, రీసెంట్ గా వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలతో మంచి డైరెక్టర్ గా మహేష్ బాబు ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు.

Also Read : Nandamuri Balakrishna : ప్రొడ్యూసర్ కి రిటన్ చెక్ ఇచ్చిన బాలయ్య, రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నారు

Related News

వైష్ణవితో నిజంగానే లవ్ ఉందా ?..అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ !

సముద్రం ఒడ్డున బాలయ్య భామ.. ఫొటో చూస్తే చూపు తిప్పుకోలేరు!

సమంత ఎంగేజ్మెంట్ రింగ్ వెనుక ఇంత స్టోరీ ఉందా.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫౌజీ వాయిదా పడినట్టేనా?

మిర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్లు ఇక లాంఛనమేనా ?

హనుమాన్ అంష్ 2లో విరాట్–అనుష్క.. నిజమేనా?

ఏంటీ ట్రెండ్ మామా.. టాలీవుడ్ హీరోలంతా 80ల్లోనే!

‘జనవరి 12 విడుదల’ పక్కా బ్లాక్ బస్టర్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

Big Stories

Advertisement
×