BigTV English

Balakrishna : పద్మభూషణ్ బాలయ్య… ఈ రోజు నందమూరి ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చే డే..

Balakrishna : పద్మభూషణ్ బాలయ్య… ఈ రోజు నందమూరి ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చే డే..

Padma Awards 2025 : టాలీవుడ్ స్టార్ నందమూరి నటసింహం బాలయ్యకు పద్మ భూషణ్ అవార్డు దక్కిందన్న విషయం అందరికి తెలిసిందే.. తెలుగు సినిమా రంగానికి విశేష కృషి చేసిన బాలయ్యకు పద్మ భూషణ్ అవార్డు ప్రదానం చేయడంపై సినీ అభిమానులు సంబరపడ్డారు. నటుడిగా, నిర్మాతగా, సమాజ సేవలో చేసిన అద్భుత కృషికి ఈ అవార్డు దక్కింది. ప్రముఖ సినీ నటుడు బాలయ్య తెలుగుదేశం పార్టీ నాయకుడు, సినిమా నిర్మాత, నటుడిగా తెలుగు సినిమా రంగంలో గొప్ప ప్రస్థానాన్ని సృష్టించారు. ఆయన తెలుగు సినిమాకి చేసిన కృషి, అనేక మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించడంతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాడు.. అందుకే భారత ప్రభుత్వం ఆయనకు అవార్డు ప్రకటించింది. అయితే నేడు ఆయన ఈ అవార్డును అందుకోబోతున్నారు.


పద్మ భూషణ్ అవార్డును అందుకోనున్న బాలయ్య..

ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్బంగా దేశంలోని పలు రంగాల వారికి పద్మ అవార్డులను ప్రకటించింది భారత ప్రభుత్వం. అందులో నందమూరి బాలయ్యకు పద్మ భూషణ్ అవార్డు దక్కింది. నేడు ఆ అవార్డు ల ప్రధానోత్సవం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో భారత రాష్ట్రపతి ద్రౌ పది ముర్ము అవార్డులను అందించనున్నారు.. కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మిణి హాజరుకానున్నారు.


పద్మ అవార్డులు..

ఈ ఏడాది పద్మ అవార్డుల జాబితాలో మొత్తం 139 మంది గ్రహీతలను ప్రకటించారు. అందులో 7 పద్మ విభూషణ్, 19 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. పద్మ విభూషణ్ అందుకోనున్న ప్రముఖుల్లో దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, జస్టిస్ శ్రీ జగదీష్ సింగ్ ఖేహర్, కుముదిని రజనీకాంత్ లఖియా, లక్ష్మీనారాయణ సుబ్రమణ్యం, ఒసాము సుజుకి ఉన్నారు. ఇక పద్మ భూషణ్ గ్రహీతల్లో పీఆర్ శ్రీజేష్, రవిచంద్రన్ అశ్విన్, ఐఎం విజయన్, హర్విందర్ సింగ్, సత్యపాల్, అజిత్ కుమార్చ, శోభనా చంద్రకుమార్ ఉన్నారు. అదేవిధంగా పద్మశ్రీ పురస్కారం అందుకోనున్న ప్రముఖుల్లో అరిజిత్ సింగ్, విలాస్‌ దాంగ్రే, వెంకప్ప అంబానీ సుగటేకర్‌, నిర్మలా దేవి, లిబియా లోబో వంటి ప్రముఖులు ఉన్నారు.

Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

సినిమాల విషయానికొస్తే.. 

బాలయ్య ఈ ఏడాది డాకు మహారాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ ని అందుకున్న కూడా పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. ప్రస్తుతం ఈయన బోయపాటి శ్రీను కాంబినేషన్లో అఖండ 2 సినిమాలో నటిస్తున్నాడు.. గతంలో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×