E-Paper
Advertisement

బెంగుళూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-లారీ ఢీ, ఏపీకి చెందిన 20 మంది వరకు

బెంగుళూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-లారీ ఢీ, ఏపీకి చెందిన 20 మంది వరకు
Advertisement

Road Accident: అతివేగం ప్రమాదకరం.. అతి వేగం వద్దని పోలీసులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రమాదాలు జరుగుతున్నాయి. బెంగుళూరు సమీపంలోని ఏపీకి చెందని ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏపీకి చెందిన 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి.

బెంగుళూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఆదివారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్కాపురం జిల్లా పామూరు నుంచి బెంగళూరు వెళ్తోంది ఉదయగిరి డిపోకు ఆర్టీసీ బస్సు. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు బెంగుళూరు సమీపంలోని చింతామణి ప్రాంతంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో బస్సులోని 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగ్రాతులకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఘటన గురించి సమచారం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు-స్థానికులు సహాయక చర్యలు చేపట్టి, బాధితులను ఆసుపత్రులకు తరలించారు.

Advertisement

బస్సు-లారీ ఢీ, ఏపీకి చెందిన 20 మంది వరకు గాయాలు

ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. ఘటనలో సమయంలో బస్సులో ఏపీకి చెందిన దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలను పక్కకు తొలగించిన పోలీసులు, ట్రాఫిక్ క్లియర్ చేశారు.

బస్సు ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఘటన ఎలా జరిగింది? అనేదానిపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ: షాదీ ముబారక్ పథకంలో భారీ స్కామ్.. రూ. 21 లక్షలు కొల్లగొట్టిన బ్రోకర్లు అరెస్ట్!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×