E-Paper
Advertisement

అర్జునుడిని మించిన విలుకాడు.. అయినా జీవితమంతా అవమానాలే… ఓటీటీలోకి తెలుగులోనే కర్ణుడి కథ

అర్జునుడిని మించిన విలుకాడు.. అయినా జీవితమంతా అవమానాలే… ఓటీటీలోకి తెలుగులోనే కర్ణుడి కథ
Advertisement

Mythological Web Series: మహాభారతంలో అర్జునుడు, భీష్ముడు, శ్రీకృష్ణుడు వంటి మహా వీరుల గురించి చాలా మందికి తెలుసు. కానీ అందరిలోనూ అత్యంత విషాదకరమైన జీవితం గడిపిన యోధుడు ఎవరు అంటే చాలామంది కర్ణుడి పేరే చెబుతారు. పుట్టుకతోనే దైవ వరం పొందినా… జీవితమంతా అవమానాలు, తిరస్కారాలు, విధి వెక్కిరింపు, అన్యాయాల మధ్య పోరాడిన కర్ణుడి కథ తాజాగా అద్భుతమైన యానిమేషన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. The Legend of Karna అనే టైటిల్ తో మహాభారతంలోని ఈ శక్తివంతమైన పాత్రను కొత్త తరానికి దగ్గర చేసే ప్రయత్నంగా రూపొందిన ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సిరీస్ తెలుగులో ఉందా ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనేది వివరంగా తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

సూర్యదేవుని అనుగ్రహంతో జన్మించిన శిశువు కర్ణుడు. జన్మించగానే కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా తన తల్లి నుంచి దూరమవుతాడు. ఆ తల్లి బిడ్డను నదిలో వదిలి పెడుతుంది. నదిలో అలా కొట్టుకొచ్చిన ఆ చిన్నారిని అధిరథుడు, రాధ దంపతులు పెంచుతారు. వారి ప్రేమలో పెరిగినా… సమాజం మాత్రం అతనిని “సూతపుత్రుడు” అనే ముద్రతోనే చిన్నచూపు చూస్తుంది.

Advertisement

చిన్నప్పటి నుంచే అసాధారణమైన విలు విద్యపై ఆసక్తి చూపిన కర్ణుడు గొప్ప యోధుడిగా ఎదగాలని కలలు కంటాడు. కానీ కులం పేరుతో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాడు. అయినప్పటికీ తన లక్ష్యాన్ని వదలకుండా కఠిన సాధన చేసి అర్జునుడికి సైతం సవాల్ విసిరే స్థాయికి చేరుకుంటాడు.

హస్తినాపురంలో జరిగిన శౌర్య ప్రదర్శనలో తన ప్రతిభను చూపించేందుకు వచ్చిన కర్ణుడు, జన్మ కారణంగా మళ్లీ అవమానానికి గురవుతాడు. అదే సమయంలో అతని ప్రతిభను గుర్తించిన దుర్యోధనుడు అతనికి అంగదేశ రాజ్యాన్ని బహూకరిస్తాడు. ఆ క్షణం నుంచి ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం మహాభారత చరిత్రనే మార్చేస్తుంది.

Advertisement

కర్ణుడు తన జీవితంలో ఎదుర్కొన్న అన్యాయాలు ఏమిటి ? అతను దుర్యోధనుడి పక్షాన ఎందుకు నిలబడ్డాడు ? విధి అతనికి ఎందుకు పదేపదే పరీక్షలు పెట్టింది ? కురుక్షేత్ర యుద్ధానికి ముందు అతని జీవితంలో జరిగిన సంఘటనలు ఎలా అతని నిర్ణయాలను ప్రభావితం చేశాయి ? అనే అంశాల చుట్టూ ఈ సిరీస్ ఆసక్తికరంగా సాగుతుంది.

తెలుగులో కూడా ఉంది

ప్రస్తుతం ‘ది లెజెండ్ ఆఫ్ కర్ణ’ సిరీస్ Sony LIVలో ఉంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అద్భుతమైన యానిమేషన్, శక్తివంతమైన నేపథ్య సంగీతంతో, మహాభారతంలోని ప్రసిద్ధ ఘట్టాలను విజువల్‌ వండర్ గా ఆవిష్కరించారు. మహాభారతంపై ఆసక్తి ఉన్నవారికి మాత్రమే కాదు… గొప్ప యోధుడి కథ వెనుక దాగి ఉన్న విషాద జీవితాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇది తప్పకుండా చూడదగ్గ సిరీస్. కర్ణుడి ధైర్యం, త్యాగం, స్నేహం, విధి చేసిన అన్యాయాన్ని భావోద్వేగంగా చూపించే ఈ యానిమేటెడ్ సిరీస్ ను కుటుంబమంతా కలిసి చూసేలా తెరకెక్కించారు. పురాణ గాథలను ఆధునిక విజువల్స్‌తో ఆస్వాదించాలని అనుకుంటే ఈ వీకెండ్‌లో దీన్ని మీ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోవచ్చు.

Read Also: ప్రాణాలు తీసిన ప్రాంక్… ఓటీటీని షేక్ చేస్తున్న షాకింగ్ టీన్ థ్రిల్లర్

Tags

Related News

ఇదెక్కడి ఉన్మాదంరా అయ్యా… పెళ్ళాన్ని చంపిందని షార్క్ పై పగబట్టే సైకో

ఒక హత్య… వంద అనుమానాలు… క్లైమాక్స్ వరకు సస్పెన్స్ గ్యారంటీ

డబ్బుల కోసమే బాయ్ ఫ్రెండ్ తో ప్రేమ డ్రామా… నాగ దుర్గ తమిళ మూవీ తెలుగు స్ట్రీమింగ్ షురూ

ఒక ప్రయాణం… రెండు ప్రేమకథలు… ప్రతి కుటుంబం చూడాల్సిన రోడ్ ట్రిప్ డ్రామా

తల్లికి పెళ్లి చేయాలనుకునే పెళ్లీడుకొచ్చిన కొడుకు… విజయ్ ఆంటోని ఫ్యామిలీ డ్రామా తెలుగులో

కుస్తీ పోటీల్లో ఇరగదీసే భార్య… ఇంట్లోనే స్ట్రగులయ్యే భర్త… తమిళ కామెడీ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు తెలుగులోనే

చెక్క వంతెన దాటితే చావు మూడినట్టే… క్లైమాక్స్‌తో పిచ్చెక్కించిన మలయాళం కల్ట్ మూవీ తెలుగులో

Big Stories

Advertisement
×