Cheating Case: అమ్మాయిలు.. ఎవరిని పడితే వారిని నమ్మి వారితో చనువుగా ఉంటున్నారా? తెలిసిన వాడే కదా.. మనవాడే కదా అని పరిచయంతో చనువు ఇస్తున్నారా? అయితే ఇకపై మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. మీ పక్కన ఉన్న మెసగాళ్లను గుర్తించకపోతే.. ఎప్పటికైనా మీరు వారి చేతిలో బలిపశువు కావాల్సందే. దీనికి ఇటీవలే జరిగిన రెండు ఘటనలే అద్దం పడుతున్నాయి.
అచ్చం సినిమా ఫక్కీలో మోసం- దగా- కుట్ర. తానే ఆమెను బ్లాక్ మెయిల్ చేసి.. తిరిగి ఆమెను కాపాడేవాడిలా హీరో అవతారమెత్తి. ఆమె నుంచి లాగాల్సిన మొత్తం లాగి.. తిరిగి విలన్ గామారి.. ఒకే వ్యక్తి మూడు నాలుగు రూపాలు. అదెలా సాధ్యమైంది? ఎక్కడ జరిగింది?? ఎలా జరగిందని చూస్తే..
హైదరాబాద్‌లో నిడదవోలు యువతిని బ్లాక్ మెయిల్ చేశాడు గుంటూరుకు చెందిన దేవ నాయక్. ఆమెతో మొదట పరిచయం. ఆపై మోసం అటు పిమ్మట ఆమెను బెదిరించాడు దేవాంతకుడైన దేవ. ఆమె న్యూడ్ ఫోటో లు, వీడియోలు తన దగ్గర ఉన్నాయంటూ ఒక అపరిచితుడిలా మొదట ఫోన్ చేశాడు దేవ నాయక్.
తనను ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు, తిరిగి దేవాకే చెప్పిందా అమాయక యువతి. ఇదే అదనుగా భావించి బ్లాకర్ మెయిలర్స్ తో తాను డీల్ చేస్తానంటూ 6 లక్షలు తీస్కున్నాడు దేవా నాయక్. ఆమె తనను మరింత నమ్మేలా.. బ్లాక్ మెయిలర్స్ తనపై దాడి చేశారంటూ.. సెంటిమెంట్ డ్రామా ప్లే చేశాడు అంతే కాదు తాను గుంటూరు ఆస్పత్రిలో చేరారనీ. ఆస్పత్రి ఖర్చులకు గానూ ఏకంగా మరో 40 లక్షల మేర వసూలు చేశాడు మాయావి నాయక్.
సినిమా ఫక్కీలో.. దేవానాయక్ తనకు సాయం చేశాడని.. తన తల్లిదండ్రులకు పరిచయం చేసిందా యువతి. గుంటూరులో హాస్టల్ పెడతానంటూ దఫ దఫాలుగా 2 కోట్ల 53 లక్షల 76 వేలు వసూలు చేశాడీ ఘరానా మోసగాడు.
గుంటూరులో హాస్టల్ చూడ్డానికి వెళ్లిన యువతికి అక్కడ దేవానాయక్ బండారం మొత్తం బయట పడింది. అక్కడతడు ఏ వ్యాపారం చేయడం లేదని గుర్తించి.. దేవానాయక్ ను తన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. అప్పుడు దేవానాయక్ ఆ యువతికి అసలు రూపం చూపించాడు. నీ న్యూడ్ ఫోటోలు, వీడియోలు తన దగ్గరే ఉన్నాయని ఆమెకు చూపించడం మాత్రమే కాదు.. బ్లాక్ మెయిల్ చేశాడని అంటున్నారు పోలీసులు.
Also Read: ప్రేయసితో సహజీవనం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, ఆపై ఫైటింగ్
ఫైనల్ పేమెంట్ గా 14 లక్షల రూపాయలు ఇవ్వక పోతే యువతి న్యూడ్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు దేవా నాయక్. మోసపోయానని గుర్తించి యువతి.. నిడదవోలు పోలీసులను ఆశ్రయించింది. యువతి కంప్లయింట్ తో కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. దేవా నాయక్ దగ్గరున్న 75 లక్షలతో పాటు ఫ్లాట్ ను సీజ్ చేశారు. దేవా నాయక్ నుంచి మొత్తం కోటి 81 లక్షల 45 వేల రూపాయలు రికవరీ చేశారు పోలీసులు.
తన వద్ద ఎలాంటి వీడియోలు లేకుండానే దేవానాయక్ యువతిని బ్లాక్‌మెయిల్‌కి పాల్పడినట్లు.. పోలీసులు విచారణలో వెల్లడించారు. సుమారు 2కోట్ల 53 లక్షల రూపాయలు యువతి చెల్లించందని తెలిపారు. దేవానాయక్‌ని అరెస్ట్ చేసి అతని వద్ద 70 లక్షల నగదుతో పాటు.. బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి బెదింపులు వస్తే… అమ్మాయిలు భయపడకుండా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని డిఎస్పీ కోరారు.