BigTV English

Vidaamuyarchi : మ్యూజిక్ డైరెక్టర్ సైలెన్స్ తో కొత్త అనుమానాలు… అజిత్ మూవీ రిజల్ట్ ముందే తెలుసా ?

Vidaamuyarchi : మ్యూజిక్ డైరెక్టర్ సైలెన్స్ తో కొత్త అనుమానాలు… అజిత్ మూవీ రిజల్ట్ ముందే తెలుసా ?

Vidaamuyarchi : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అజిత్ కుమార్ (Ajith Kumar) హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘విదాముయార్చి’ (Vidaamuyarchi). ఈ మూవీ ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రాబోతోంది. అయితే సినిమా రిలీజ్ కి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, బజ్ మాత్రం జీరో అన్నట్టుగా ఉంది. మరోవైపు ఈ సినిమా విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ సైలెన్స్ చూస్తుంటే ఆయనకి రిజల్ట్ ముందే తెలుసా ? అనే అనుమానాలు నెలకొన్నాయి.


అజిత్ మూవీపై జీరో బజ్

టాలీవుడ్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న కోలీవుడ్ హీరోలలో అజిత్ కుమార్ (Ajith Kumar) కూడా ఒకరు. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో తాజాగా అజిత్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విదాముయార్చి’ (Vidaamuyarchi) రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇందులో అజిత్ సరసన హీరోయిన్ గా త్రిష కృష్ణన్ నటించగా, రెజీనా కసండ్రా, అర్జున్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని తెలుగులో ‘పట్టుదల’ అనే టైటిల్ తో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పటిదాకా భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీకి ప్రమోషన్స్ మాత్రం పెద్దగా జరగలేదు.


ముఖ్యంగా తెలుగులో అజిత్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ ఈ మూవీ ప్రమోషన్స్ కు దాన్ని వాడుకోవట్లేదు మేకర్స్. దీంతో ‘విదాముయార్చి’ సినిమాపై తెలుగులో జీరో బజ్ నెలకొంది. తమిళంలో మాత్రం అజిత్ కుమార్ స్టార్ పవర్ కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి.

మ్యూజిక్ డైరెక్టర్ సైలెన్స్

ఇప్పుడు అందరి దృష్టి ఈ మూవీకి సంగీతం అందిస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ (Anirudh Ravichandran) పైనే ఉంది. సాధారణంగా అనిరుధ్ తాను మ్యూజిక్ అందించిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు ఉత్సాహంగా కనిపిస్తారు. పైగా సోషల్ మీడియాలో ఆ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ తో తన వంతుగా హైప్ పెంచే ప్రయత్నం చేస్తారు. ఎక్కువగా సినిమా గురించి ఏమీ మాట్లాడకపోయినా, కనీసం ఫైర్ ఎమోజిలను షేర్ చేస్తూ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని హింట్ ఇస్తారు.

కానీ ఇప్పుడు ‘విదాముయార్చి’ మూవీ విషయంలో అనిరుధ్ తనకసలు ఏమాత్రం సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తించడం సినిమాపై కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది. కొంపతీసి ఈ మూవీ రిజల్ట్ ఏంటో అనిరుధ్ కి ముందే తెలిసిందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

మరోవైపు ఈ సినిమాలో హీరోగా నటించిన అజిత్ కుమార్ కార్ రేసింగ్ లతో బిజీగా ఉండడం వల్ల మూవీ ప్రమోషన్లకు దూరంగా ఉంటున్నారు. మరి లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకులు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ మూవీ గనక జీరో బజ్ తోనే బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనిపిస్తే గనక, స్ట్రాంగ్ కంటెంట్, పవర్ ఫుల్ యాక్టర్స్ ఉంటే ప్రమోషన్స్ అక్కర్లేకుండానే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కాగలవని నిరూపించినట్టుగా అవుతుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×