BigTV English

Tollywood: 110 చిత్రాలలో హీరోయిన్ గా అవకాశం.. ఆ ఒక్క కారణంతో ఇండస్ట్రీ నుండి దూరం.. ఎవరంటే?

Tollywood: 110 చిత్రాలలో హీరోయిన్ గా అవకాశం.. ఆ ఒక్క కారణంతో ఇండస్ట్రీ నుండి దూరం.. ఎవరంటే?

Tollywood: ఇప్పుటి జనరేషన్ హీరోయిన్లు కనీసం 30, 40 సినిమాలు చేయకుండానే ఇండస్ట్రీలో ఫేడ్ అవుట్ అవుతున్నారు.కానీ ఒకప్పటి హీరోయిన్లు మాత్రం ఏకంగా 100 కి పైగా సినిమాల్లో నటించేవారు. అలా ఎంతో మంది హీరోయిన్లు వందకి పైగానే చేశారు. కానీ వందకి తక్కువ సినిమాలు చేసిన సీనియర్ హీరోయిన్స్ అయితే లేరు. అలా ఒకప్పుడు తన నటనతో, డాన్స్ తో ఎంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అనారోగ్యంతో ఇలా తయారైంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే భానుప్రియ (Bhanupriya).. సీనియర్ నటి భానుప్రియ అంటే తెలియని వారు ఉండరు. ఈమె తన నటనతో, డ్యాన్స్ తో ఎంతోమందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా భానుప్రియతో సినిమా అంటే చాలామంది స్టార్ హీరోలు భయపడేవారట. ఎందుకంటే డాన్స్ చేసే సమయంలో ఆమెతో మ్యాచ్ చేస్తామో లేదో అని వణికి పోయేవారట.


110 కి పైగా చిత్రాలలో నటించిన భానుప్రియ..

అంత బాగా డాన్స్ చేసేదట భానుప్రియ. ఇక అలాంటి ఈ హీరోయిన్ చిరంజీవి(Chiranjeevi ), బాలకృష్ణ (Balakrishna), వెంకటేష్(Venkatesh), మోహన్ బాబు(Mohanbabu) వంటి అప్పటి తరం హీరోలందరితో కలిసి నటించింది. అలా తెలుగు , తమిళ భాషల్లో దాదాపు 110 సినిమాల్లో భానుప్రియ హీరోయిన్ గా చేసింది. ఇక హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక స్టార్ హీరో హీరోయిన్లకు తల్లి , అత్త పాత్రల్లో కూడా నటించింది. అలా చత్రపతి(Chatrapathi), గూఢచారి 116, కాష్మోరా, దమ్ము వంటి కొన్ని సినిమాల్లో కూడా చేసింది. అయితే ఇప్పటికి కూడా భానుప్రియకి ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆమెకు ఉన్న అనారోగ్యంతో సినిమాలు చేయలేకపోతుందట.


మతిమరుపు కారణంగానే ఇండస్ట్రీకి దూరం..

అయితే రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భానుప్రియ(Bhanupriya) మాట్లాడుతూ.. “నాకు ఇప్పటికి కూడా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. కానీ నా మతిమరుపు కారణంగా సినిమాల్లో చేయలేకపోతున్నాను. గత కొద్దిరోజుల నుండి నేను ఎన్నో విషయాలు మర్చిపోతున్నాను. నేను చేయవలసిన పనులు కూడా మర్చిపోయేంత మతిమరుపు వచ్చింది. అప్పుడప్పుడు షూటింగ్ సెట్ కి వెళ్లే సమయంలో చెప్పాల్సిన డైలాగులు మర్చిపోయి ఎంతగానో ఇబ్బందిపడ్డాను. అందుకే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నాను అంటూ భానుప్రియ చెప్పుకొచ్చింది. ఇక భానుప్రియ చివరిగా తమిళ్ హీరో శివ కార్తికేయన్ (Shiva Karthikeyan)నటించిన ‘అయిలాన్’ మూవీలో కనిపించింది. ప్రస్తుతం సినిమాలు తగ్గించేసి పూర్తిగా ఇంటి పట్టునే ఉంటుంది.

భర్త మరణమే ఈ దుస్థితికి కారణం..

అయితే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన భానుప్రియకి ఈ దుస్థితి రావడానికి కారణం ఆమె భర్త మరణం అని తెలుస్తోంది. ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సమయంలోనే ఆదర్శ్ కౌశల్(Adarsh Koushal) ని ప్రేమించి, పెళ్లి చేసుకుంది భానుప్రియ. అలా చాలా సంవత్సరాలు భానుప్రియ వైవాహిక జీవితం బాగుంది.కానీ 2018లో భర్త మరణంతో భానుప్రియ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఇక భర్త మరణించాక కొద్ది రోజులకు భానుప్రియకి గుండెపోటు కూడా వచ్చింది.దాంతో ఆమె పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. వయసు మీద పడడంతో అనారోగ్య కారణాలవల్ల మతిమరుపు కూడా వచ్చేసింది. అలా ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న భానుప్రియ ప్రస్తుతం అవకాశాలు ఉన్నా కూడా సినిమాల్లో చేసే పరిస్థితి లేదు.ఇక భానుప్రియ పేరు చెప్పగానే అందరికీ సితార మూవీ(Sitara Movie)నే గుర్తుకొస్తుంది.ఈ సినిమా కంటే ముందు రెండు సినిమాలు చేసినప్పటికీ వంశీ డైరెక్షన్లో వచ్చిన సితార సినిమాతో భానుప్రియ (Bhanupriya) ఫేమస్ అయింది..

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×