BigTV English

HouseMaid Murder Rape: చెన్నైలో పనిమనిషిని హత్య చేసిన దంపతులు.. మరొకరిపై గ్యాంగ్ రేప్

HouseMaid Murder Rape: చెన్నైలో పనిమనిషిని హత్య చేసిన దంపతులు.. మరొకరిపై గ్యాంగ్ రేప్

HouseMaid Murder Rape| మైనర్లతో పనిచేయించడం చట్టరీత్యా నేరం అలాంటిది ఒక టీనేజ్ అమ్మాయిని పనిమనిషిగా పెట్టుకొని.. ఇంట్లో ఆమె చేత నానా చాకిరి చేయించారు. ఆమెను లైంగికంగా వేధించి చివరకి హత్య చేశారు. వేధించడం అంటే సామాన్యంగా కాదు.. సిగరెట్లతో కాల్చడం, మండిపోతున్న ఇస్త్రీ పెట్టెతో వాతలు పెట్టడం లాంటివి చేశారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆ అమ్మాయి చనిపోయింది. ఆ తరువాత ఇంటి ఓనర్లు ఆమె మృతదేహాన్ని వదిలి పరారయ్యారు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో జరిగింది.


పోలీసుల కథనం ప్రకారం.. చెన్నై నగరంలోని అమిన్‌జికరాయి ప్రాంతం మెహ్తా నగర్ లో మొహమ్మద్ నిషాద్, నాసియా నివసిస్తున్నారు. వారికి ఇంటిపని చేయడానికి ఒక మహిళ అవసరం ఉండగా.. తంజావూరు వారికి తెలిసిన ఒక మహిళను సంప్రదించారు. ఆ మహిళ చాలా పేద కుటంబానికి చెందినది. ఆమె భర్త కూడా చనిపోయాడు. అయితే ఆమె వయసు ఎక్కువగా కావడంతో ఆమె కూతురు (15) అయితే ఇంటిపని బాగా చేయగలదని భావించారు. అందుకోసం ఆ మహిళను తన కూతురుని తమ ఇంట్లో పనిచేసేందుకు ఒప్పించి చెన్నైకి తీసుకువచ్చారు.

Also Read: స్కృడ్రైవర్‌తో పొడిచి పొడిచి హత్య.. భర్తను వదిలి బాయ్‌ఫ్రెండ్‌తో 4 పిల్లల తల్లి సహజీవనం


కానీ చెన్నైకి చేరుకున్నాక.. ఆ మైనర్ పనిమనిషితో ఇంట్లో ఎక్కువ పనిచేయించేవారు. వారి ఇంటికి తరుచూ బంధువులు, స్నేహితులు వచ్చేవారు. దీంతో ఇంట్లో ఎక్కువ వంట చేయడం, ప్లేట్లు, పెద్ద గిన్నెలు కడగడం, ఇంట్లో బట్టలన్నీ ఉతికి ఇస్త్రీ చేయడంతో పాటు బయట సామాన్లు కూడా తీసుకురావాలి. అయితే ఆమెకు వంట చేయడంలో అంత అనుభవం లేదు. దీంతో బంధువులు ఇంటికి వచ్చిన వేళ రుచికరమైన వంట చేయలేదని.. ఆమెను కొట్టారు.

ఒకరోజు బట్టలకు ఇస్త్రీ సరిగా చేయలేదని ఇంటి యజమాని నాసియా ఆమెకు కాలిపోతున్న ఐరన్ బాక్స్ తో చేతులపై వాతలు పెట్టింది. అది చాలదన్నట్లుగా ఆరోజే బయటి నుంచి సామాన్లు తీసుకువస్తుంటే కాలిపోయిన చేతులు నొప్పి కారణంగా ఆ సామాన్లు కిందపడిపోయాయి. దీంతో నాసియా భర్త మొహమ్మద్ నిషాద్ ఆమెకు సిగరెట్ తాగుతూ ఆ సిగరెట్లతో కాల్చాడు. ఈ కారణంగా ఆమెకు జ్వరం చేయడంతో మరుసటి నిద్రలేవలేకపోయింది. దీంతో ఆమె సమయానికి నిద్ర లేవలేదని బెల్టుతో కొట్టారు. ఈ గాయాలన్నీ తట్టుకోలేక ఆ అమ్మాయి చనిపోయింది.

ఇది గమనించిన భార్యభర్తలిద్దరూ పనిమనిషి శవాన్ని వదిలి తమ బంధువుల ఇంటికి పారిపోయారు. ఆ తరువాత ఒక లాయర్ ని సంప్రదించి తాము ఏమీ చేయలేదని పనిమనిషి చనిపోయిందని చెప్పారు. ఆ లాయర్ ముందుగా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసులు నాసియా అపార్టెమెంట్ కు చేరుకొని పనిమనిషి శవాన్ని కిల్ పాక్ మెడికల్ కాలేజీకి పోస్ట్ మార్టం కోసం పంపించారు. పనిమనిషిని దంపతులిద్దరూ ఎలా వేధించారో పొరుగింటి వారు చెప్పడంతో పోలీసులు హత్య, పోక్సో కేసు నమోదు చేసి నాసియా దంపతులను అరెస్టు చేశారు. ఈ కేసులో నాసియాకు చెందిన నలుగురు బంధువులు కూడా పనిమనిషిని కొట్టారని సమాచారం ఉండడంతో వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

Also Read : దీపావళి రోజు మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్త.. అతని ప్రైవేట్ పార్ట్ కోసేసిన భార్య!

ఇలాంటిదే మరో ఘటన బిహార్ రాజధాని పట్నా నగరంలో జరిగింది. అక్కడ ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్ లో పనిమనిషి కూతురిపై సామూహిక అత్యాచారం జరిగింది. అయితే శుక్రవారం నవంబర్ 1 2024 రాత్రి 8 గంటలకు ఆ పనిమనిషి తన కూతురు (15) ఆపార్ట్ మెంట్ లో తన యజమాని ఇచ్చే వస్తువులను తీసుకురావాలని పంపింది. కానీ బిల్డింగ్ లోని మరో అపార్ట్ మెంట్ లో నివసించే ఒక ట్రావెల్ ఏజెంట్ ఆ అమ్మాయిని బలవంతంగా తన ఫ్లాట్ కు ఎత్తుకెళ్లాడు. ఆ తరువాత తన స్నేహితులతో కలిసి ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన తరువాత ఆ అత్యాచారం.. కారు పార్కింగ్ లో స్ప‌‌ృహ తప్పిపోయి పడిపోయింది. ఆమె శరీరమంతా రక్తం ఉండడంతో ఆ బిల్డింగ్ లో ఇతరులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అమ్మాయిని ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగిందని ధృవీకరించారు. దీంతో పోలీసులు బిల్డింగ్ సీసిటివి వీడియోల ఆధారంగా ఆ ట్రావెల్ ఏజెంట్ ని పట్టుకున్నారు. అయితే గ్యాంగ్ రేప్ చేసిన ఇతరులు పరారీలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి విషమంగా ఉందని, ఆమె ప్రైవేట్ భాగాలపై కూడా గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. నిందితులపై సామూహిక అత్యాచారం, పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని చెప్పారు.

Related News

kolkata: కోల్‌క‌తాలో భారీ వ‌ర్షం.. ఐదుగురు మృతి!

Building Collapse: కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు సజీవ సమాధి

Khammam: ఖానాపురంలో దారుణం.. కూర వేయలేదని మహిళపై గొడ్డలితో దాడి

Kerala News: భార్యని చంపిన భర్త.. ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో లైవ్, అసలు మేటర్ ఇదీ?

Instagram love: ప్రియురాలిని చంపి.. సూట్‌కేస్‌లో బాడీని కుక్కి.. సెల్పీ తీసుకున్న ప్రియుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే?

Heart Attack: పుట్టినరోజు నాడే చావు.. బతుకమ్మ ఆడుతూ కుప్పకూలి మహిళ

Guntur: నోటికి ప్లాస్టర్, ముక్కుకి క్లిప్.. లేడీస్ హాస్టల్‌లో యువతి అనుమానస్పద మృతి

Medipally Incident: దారుణం.. సీనియర్ల వేధింపులకు బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..

Big Stories

×