E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

మేం కొనాలనుకున్న ఇల్లు నువ్వెలా కొంటావ్? హైదరాబాద్‌లో గృహప్రవేశం ఇంటిపై మూకదాడి, రక్తసిక్తమైన శుభకార్యం!

మేం కొనాలనుకున్న ఇల్లు నువ్వెలా కొంటావ్? హైదరాబాద్‌లో గృహప్రవేశం ఇంటిపై మూకదాడి, రక్తసిక్తమైన శుభకార్యం!
Advertisement

Hyderabad: హైదరాబాద్‌ శివారులోని బోడుప్పల్‌లో ఆదివారం జరిగిన ఒక ఘోర సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎంతో ఆశతో, జీవితకాల కష్టార్జితంతో నిర్మించుకున్న కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్న వేళ.. ఆ కుటుంబంపై కొందరు దుండగులు కాలయముల్లా విరుచుకుపడ్డారు. “మేం కొనాలనుకున్న ఇల్లు.. నువ్వెలా కొంటావ్..?” అంటూ రాళ్లు, కర్రలతో గృహప్రవేశం జరుగుతున్న ఇళ్లే లక్ష్యంగా బీభత్సం సృష్టించారు. సంతోషాలతో వెలిగిపోవాల్సిన ఆ శుభకార్యం కాస్తా, ఒక్కసారిగా రక్తసిక్తంగా మారి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

శుభకార్యంలో ఊహించని నరరూప నృత్యం
బోడుప్పల్‌కు చెందిన శ్యామ్‌రావు అనే వ్యక్తి కొత్త ఇల్లు కొనుగోలు చేసి, బంధుమిత్రుల సమక్షంలో ఆదివారం ఎంతో వైభవంగా గృహప్రవేశ వేడుకను ఏర్పాటు చేసుకున్నారు. అందరూ వేడుకలో మునిగిపోయి ఉన్న సమయంలో.. అకస్మాత్తుగా ఒక మూక రాళ్లు, కర్రలతో ఇష్టారాజ్యంగా దాడికి తెగబడింది. ఇంటి ప్రధాన గేటు, తలుపులు, కిటికీ అద్దాలను ధ్వంసం చేస్తూ లోపలికి దూసుకొచ్చారు. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఇంటి యజమాని శ్యామ్‌రావుతో పాటు మరో ముగ్గురు బంధువులపై నిందితులు కర్కశంగా దాడి చేశారు. ఈ దాడిని తన మొబైల్‌లో రికార్డ్ చేయడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని కూడా వదలకుండా చితకబాదారు.

Advertisement

పోలీసుల ముందే రెచ్చిపోయిన దుండగులు
ఈ ఘోరకలిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే, శాంతిభద్రతలను కాపాడాల్సిన ఖాకీలు అక్కడ ఉన్నంతసేపు కాస్త తగ్గినట్టు నటించిన ఆ మూక.. పోలీసులు వెళ్లిన కేవలం అరగంట వ్యవధిలోనే మళ్లీ రెట్టింపు పగతో విరుచుకుపడింది. రెండోసారి జరిగిన ఈ దాడిలో ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉన్న 5 కార్లు, 3 బైకులను పూర్తిగా ధ్వంసం చేశారు. దీనివల్ల బాధితులకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఒక వైపు బాధితులు రక్తగాయాలతో రోదిస్తున్నా కనీస మానవత్వం లేకుండా నిందితులు చేసిన రచ్చ స్థానికులను భయాందోళనలకు గురిచేసింది.

రాజకీయ అండతోనే అరాచకం?
ఈ అమానుష దాడి వెనుక స్థానిక భూమాఫియా, ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన బస్తీ లీడర్ హస్తం ఉన్నట్లు బలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడు కొనుగోలు చేసిన సదరు ప్రాపర్టీపై కన్నేసిన ఆ లీడర్.. దాన్ని దక్కించుకోలేకపోయాననే కక్షతోనే ఈ తరహా రౌడీయిజానికి తెరలేపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ విజువల్స్ ఆధారంగా విచారణ జరిపి ఇప్పటివరకు 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. లీగల్‌గా కొనుక్కున్న ఇంటిపై ఇలాంటి దాడులు జరగడం పట్ల నగరవాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: జీతం కోతలపై హెచ్‌ఆర్‌ను నిలదీసిన ఉద్యోగి.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైరల్ వీడియో

Related News

Illegal Bakery: గడువు ముగిసి కుళ్లిన పదార్ధాలతో బేకరీ దందా.. ఇద్దరు అరెస్ట్..!

టపాసుల్లా పేలుతున్న ఏసీలు.. నోయిడాలో హౌసింగ్ సొసైటీలో భారీ అగ్నిప్రమాదం, ఎగిసిపడిన మంటలు

Road Accident: కారు రివర్స్ చేస్తుండగా ప్రమాదం.. ఓకే ఫ్యామిలీలో నలుగురు మృతి, ఇలా మీరు చేయొద్దు!

కర్ణాటకలో ఘోరం.. యువతిపై కత్తితో దాడి చేసి, పెట్రోల్ బాంబుతో వ్యక్తి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?

Plane Crash: సౌతాఫ్రికాలో ఘోర ప్రమాదం.. హన్మకొండ జిల్లాకు చెందిన పైలట్ దుర్మరణం!

మంచిర్యాలలో దారణం.. తమ్ముడిని గొడ్డలితో నరికి చంపిన అన్న!

కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. బజ్జీలు తిని 50 మందికి అస్వస్థత!

Big Stories

×