E-Paper
Advertisement

145 కి.మీ రేంజ్ తో కొత్త స్కూటర్.. ధర కూడా తక్కువేనండోయ్!

145 కి.మీ రేంజ్ తో కొత్త స్కూటర్.. ధర కూడా తక్కువేనండోయ్!
Advertisement

BGauss OoWah MAX Plus: ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి కొత్త మోడళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే BGauss కొత్త OoWah MAX Plus స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్‌ షోరూమ్ ధరను రూ.1.23 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న OoWah EX కంటే  ఈ మోడల్ పై స్థాయి మోడల్‌ గా ఉంటుంది. ముఖ్యంగా సిటీలో రోజువారీ ప్రయాణాలకు, తొలిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసేవారిని దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

పెద్ద బ్యాటరీతో ఎక్కువ రేంజ్

OoWah MAX Plusలో స్పెషాలిటీ బ్యాటరీ. ఇందులో 3kWh LFP బ్యాటరీని అందించారు. దీనిని అవసరమైనప్పుడు స్కూటర్ నుంచి బయటకు తీసి ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 145 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్‌ లో 2.4kW పీక్ పవర్, 1.5kW కంటిన్యూయస్ పవర్ అందించే PMSM హబ్ మోటార్‌ను ఉపయోగించారు. ఇదే మోటార్ OoWah EXలో కూడా ఉంది. బ్యాటరీ సామర్థ్యం పెరిగినప్పటికీ గరిష్ట వేగాన్ని గంటకు 60 కిలోమీటర్లకే పరిమితం చేశారు.

బ్యాటరీకి ప్రత్యేక ఫీచర్లు

Advertisement

MAX Plus బ్యాటరీ CAN టెక్నాలజీతో పనిచేస్తుంది.  మోటార్, బ్యాటరీ రెండింటికీ IP67 రేటింగ్ ఉంది. అంటే దుమ్ము, నీటి నుంచి రక్షణ కల్పించేలా వీటిని రూపొందించారు. అంతేకాదు, రివర్స్ అసిస్ట్, డిస్టెన్స్ టు ఎంప్టీ ఇండికేటర్ లాంటి ఫీచర్లను కూడా అందించారు. ముఖ్యంగా ఉన్న బ్యాటరీ ఛార్జ్ తో ఇంకా ఎంత దూరం ప్రయాణించగలమో తెలుసుకోవడానికి ఈ ఇండికేటర్ ఉపయోగపడుతుంది. ఇక స్కూటర్‌ తో పాటు కంపెనీ 750W ఛార్జర్‌ ను అదనపు ఖర్చు లేకుండా అందిస్తోంది. ఈ ఛార్జర్‌తో బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 3 గంటల 30 నిమిషాలు పడుతుంది. పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయడానికి 4 గంటల 55 నిమిషాల సమయం పడుతుంది.

సౌకర్యవంతమైన డిజైన్

MAX Plusలో సీటు ఎత్తు 765 మిల్లీమీటర్లుగా ఉంది. 160 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో సిటీ రోడ్లపై రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. అయితే పెద్ద బ్యాటరీ కారణంగా స్కూటర్ బరువు 104 కిలోలకు పెరిగింది. సీటు కింద 21 లీటర్ల స్టోరేజ్ స్థలం ఉంది. రోజువారీ ప్రయాణంలో బ్యాగులు, ఇతర వస్తువులు పెట్టుకోవడానికి  ఉపయోగపడుతుంది. స్కూటర్‌ లో LED లైటింగ్, డ్రమ్ బ్రేకులు, CBS, USB ఛార్జింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ వెహికల్  ఛార్జర్‌కు 3 సంవత్సరాలు లేదంటే 36,000 కిలోమీటర్లు, బ్యాటరీకి 3 సంవత్సరాలు లేదంటే 50,000 కిలోమీటర్ల వారంటీ ఉంది. అదనపు ఖర్చుతో దీనిని 5 సంవత్సరాలు లేదంటే 75,000 కిలోమీటర్ల వరకు పొడిగించుకోవచ్చు.

నాలుగు రంగుల్లో లభ్యం

Advertisement

BGauss OoWah MAX Plusను ఎమరాల్డ్ షాడో, జామున్ పంచ్, టాంగీ తోమా, జెస్టీ రెడ్ కలర్స్ లో అందిస్తోంది. దీని ధర రూ.1.23 లక్షలు (ఎక్స్‌ షోరూమ్). మరోవైపు OoWah EX ధర రూ.94,990గా కొనసాగుతోంది.

Read Also: కొత్త లుక్.. సరికొత్త ఫీచర్లు.. కొత్త బాలెనో వచ్చేస్తోంది!

Tags

Related News

కొత్త లుక్.. సరికొత్త ఫీచర్లు.. కొత్త బాలెనో వచ్చేస్తోంది!

సూపర్ రేంజ్, అదిరిపోయే ఫీచర్లు.. ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్ కొత్త వెర్షన్ వచ్చేసింది!

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఉబెర్, రాపిడోల్లో ముందే టిప్ అడగటం కుదరదు.. కేంద్రం కొత్త రూల్స్!

ట్రక్కుల వెనుక ‘Horn OK Please’ అని ఎందుకు రాస్తారో తెలుసా? ఆ ‘OK’ వెనుక పెద్ద చరిత్రే ఉంది!

రూ.2 లక్షలకే అదిరిపోయే స్పోర్ట్స్ బైక్.. జస్ట్ రూ. 10 వేలతో బుక్ చేసుకోండి!

ఎంజీ హెక్టర్ హాక్ వచ్చేస్తోంది.. PHEV, ఎలక్ట్రిక్ వెర్షన్లతో అదిరిపోయే ఎంట్రీ!

Y43 మైక్రో SUV To ఎలక్ట్రిక్ MPV.. మారుతి వస్తున్న 4 క్రేజీ యుటిలిటీ వెహికల్స్ ఇవే!

Big Stories

Advertisement
×