E-Paper
Advertisement

స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న రోజా, శ్రీకాంత్.. మాటలు రావట్లేదంటూ!

స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న రోజా, శ్రీకాంత్.. మాటలు రావట్లేదంటూ!
Advertisement

TV: ప్రేక్షకులను ఎప్పటికప్పుడు మంచి వినోదంతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ సన్నివేశాలతో ఎన్నో షోలు ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అలాంటి షోలలో ‘డ్రామా జూనియర్స్’ కూడా ఒకటి. చిన్నపిల్లలు తమ ముద్దు ముద్దు మాటలతో వేసే స్కిట్స్ ఎంత అయితే ఆహ్లాదకరంగా మనసుకు హత్తుకుంటాయో.. వారు చేసే ఎమోషనల్ టచ్ స్కిట్లు కూడా అంతే హత్తుకుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరు చిన్నారులు చేసిన స్కిట్ అందరిని ఆలోచింపచేసాయి. పైగా ఆ స్కిట్ చూసిన జడ్జెస్ రోజా (Roja), శ్రీకాంత్ (Srikanth) ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంటూ మాటలు రావట్లేదు అంటూ చేసిన భావోద్వేగపూరిత కామెంట్లు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మరి ఆ పిల్లలు చేసిన స్కిట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఘనంగా డ్రామా జూనియర్స్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే..

డ్రామా జూనియర్స్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే కి చేరుకుంది. సీజన్ 9 టైటిల్ ఎవరి వశం కానుంది? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అటు చిన్నారులు కూడా మంచి మెసేజ్ ఓరియెంటెడ్ స్కిట్ లతో అందరిని అబ్బురపరుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ఒక స్కిట్ అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. స్కిట్ విషయానికి వస్తే.. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులను కొంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్ లో వదులుతున్న విషయం అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా పిల్లల కోసం ఎంతో కష్టపడే తల్లిదండ్రులు చివరాంఖంలో తమ పిల్లలే తమకు ఆసరాగా నిలబడతారు అనుకునే సమయంలో.. పిల్లలకు రెక్కలు రాగానే తల్లిదండ్రులను వదిలిపోవడం ఎంత విషాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఒక స్కిట్ గా తీసుకొని ఆ పిల్లలు చేసిన పర్ఫామెన్స్ అందరినీ కదిలించాయి.

Advertisement

ALSO READ:ఆరేళ్లయినా వీడని మిస్టరీ.. సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అంటున్న సోదరి!

రియల్ స్టోరీ తో చిన్నారుల స్కిట్..

ఇద్దరు వృద్ధ దంపతులు ఉంటారు. భార్యాభర్త సరదాగా తగువులాడుకుంటూ ఉంటారు. తన భార్య తన పెద్ద కొడుకుకి ఫోన్ చేస్తానని ఫోన్ దగ్గరికి వెళుతుంది. వాళ్ళు ఆ ఫోన్ ఎత్తరు.. దీంతో ఆమె బాధపడుతూ ఎందుకండీ మనము ఎన్నిసార్లు ఫోన్ చేసినా మన పిల్లలు ఫోన్ లిఫ్ట్ చేయరు అంటూ బాధపడుతుంది. ఇక ఆమె భర్త మనం ఉన్నది ఓల్డ్ ఏజ్ హోమ్ లో అంటూ అసలు విషయం చెబుతాడు. గేటు చప్పుడు కాగానే ఆమె గేటు వైపు చూస్తుంది.. ఎందుకు? ఏమైంది? అని భర్త అడిగితే.. మన పిల్లలు వస్తున్నారేమో అంటూ ఆశగా ఎదురుచూస్తున్నాను అంటూ చెబుతుంది .

కన్నీళ్లు పెట్టుకున్న రోజా, శ్రీకాంత్..

Advertisement

ఇక భర్త వాళ్లు రారు అని చెబుతుండగానే.. ఒకవేళ నీకంటే నేను ముందు వెళ్లిపోయినా గేటు వైపు మాత్రం చూడడం ఆపకండి.. ఎందుకంటే మన పిల్లలు ఏ క్షణాన వస్తారో అంటూ ఆమె చేసిన కామెంట్లు అందరినీ కంటతడి పెట్టించాయి. పైగా ఆ స్కిట్ చూసిన జడ్జెస్ రోజా, శ్రీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. హోస్ట్ సుధీర్ కూడా ఒక్కసారిగా ఏడ్చేసాడు. శ్రీకాంత్ అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయి.. నాకు మాటలు రావట్లేదు అంటూ చేసిన వైనం కన్నీళ్లు పెట్టించింది. మొత్తానికి అయితే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారిందని చెప్పవచ్చు.

Related News

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. శృతి దొరుకుతుందా..? ప్రభాకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..

Karthika Deepam 2 Serial Today Episode September 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని బెదిరించడంతో జ్యోత్స్నను జాబ్ లోంచి తీసేసిన కేఫ్ ఓనరు             

Illu Illalu Pillalu Today Episodes: భాగ్యంకు షాక్.. ప్రేమ మాటతో ఫ్యూజుల్ అవుట్.. ప్రేమ పెళ్లికి రెడీ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్.. అవని దెబ్బకు షాక్.. పల్లవి పై అనుమానం..

Gundeninda Gudigantalu : ఒడియమ్మ బంటి.. ఒకరు కాదు.. ఇద్దరు అవుట్..

Ninnu kori Serial Today Episode September 29th ‘నిన్ను కోరి’ సీరియల్‌: జీవన్ కు వార్నింగ్ ఇస్తున్న దాక్షాయణి   

Tuesday Tv Movies : మంగళవారం మూవీ లవర్స్ కు పండగే.. డోంట్ మిస్…

Big Stories

Advertisement
×