E-Paper
Advertisement

ప్రతీ రోజూ 1.5GB డేటా ఇచ్చే.. రూ.330 లోపు జియో ప్లాన్స్.. ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్ ఫ్రీ!

ప్రతీ రోజూ 1.5GB డేటా ఇచ్చే.. రూ.330 లోపు జియో ప్లాన్స్.. ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్ ఫ్రీ!
Advertisement

Jio 1.5GB Plans: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ఎన్నో రకలా చౌకైన ప్లాన్స్ ను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ప్రతీరోజూ డేటా, అపరిమిత కాలింగ్ కోరుకునే వారికి.. 1.5GB డైలీ డేటా ప్లాన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అన్ని వర్గాల కస్టమర్లు ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో జియోలో రూ.350లోపు బడ్జెట్ లో ప్రతీరోజూ 1.5GB డేటా అందించే చౌకైన ప్లాన్స్ ను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

రూ. 199 ప్లాన్

ఈ ప్లాన్ 18 రోజుల వ్యాలిడిటీతో రూపొందింది. దీనిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్లకు ప్రతిరోజూ 1.5GB డేటా (ఓవరాల్ గా 27GB), అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్ కింద రోజుకు సగటున రూ.11 మాత్రమే ఖర్చు కానుంది. .

రూ. 239 ప్లాన్

Advertisement

ఈ ప్లాన్ 22 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజుకు 1.5GB చొప్పున మొత్తంగా 33GB డేటా పొందొచ్చు. అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSల సౌకర్యం ఇందులో కూడా ఉంది. పైగా ఈ రెండు ప్లాన్లలోనూ జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీగా లభిస్తాయి.

పూర్తి స్థాయి నెలవారీ ప్లాన్లు..

నెలవారీ ప్యాక్ ఎంచుకోవాలనుకునే వారికి జియో ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది. రూ. 299, రూ. 319, రూ. 329 ప్లాన్లతో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు ఏకంగా రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో 18 నెలల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఇందులో 5,000GB క్లౌడ్ స్టోరేజ్, నానో బనానా తదితర బెనిఫిట్స్ ఉంటాయి.

రూ. 299 ప్లాన్

Advertisement

28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్లో రోజుకు 1.5GB డేటా (మొత్తం 42GB), అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి.

రూ. 319 ప్లాన్

క్యాలెండర్ నెల వ్యాలిడిటీ (30 రోజులు) కోరుకునేవారి కోసం జియో ఈ ప్లాన్ తీసుకోచ్చింది. ఇందులోనూ ప్రతీ రోజూ 1.5GB డేటా, కాలింగ్ బెనిఫిట్లతో పాటు ప్రతీ నెల ఒకే తేదీన రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

Also Read: BSNL బిగ్ ధమాకా ప్లాన్.. రూ. 319 కే 65 రోజుల వ్యాలిడిటీ.. ఇదేం ఆఫర్ బాబోయ్!

రూ. 329 ప్లాన్

ఈ ప్లాన్ లో రోజువారీ 1.5GB డేటా, కాలింగ్ బెనిఫిట్లతో పాటు సంగీత ప్రియుల కోసం ఇందులో జియోసావన్ ప్రో (JioSaavn Pro) సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా ఇస్తున్నారు. దీని వ్యాలిడిటీ కూడా 28 రోజులు.

Also Read: Bigg Boss Abhijith : కంటెస్టెంట్ పై అభిజిత్ సీరియస్.. ఇదేం పని భయ్యా..

Tags

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×