BigTV English

IPL Betting Youth Dies: ఐపీఎల్ బెట్టింగ్.. పట్టాలపై విగత జీవిగా యువకుడు, కన్నీళ్లు పెట్టించే ఘటన

IPL Betting Youth Dies: ఐపీఎల్ బెట్టింగ్.. పట్టాలపై విగత జీవిగా యువకుడు, కన్నీళ్లు పెట్టించే ఘటన

IPL Betting: మేడ్చల్ పొలీస్ స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కి మరో యువకుడు బలయ్యాడు. గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపం చెంది గౌడవెల్లి పరిధిలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ ప్రాంతానికి చెందిన సోమేశ్ గత కొన్ని సంవత్సరాలుగా.. ఈ బెట్టింగ్స్‌కి బానిసయ్యాడు. ఐపీఎల్ మ్యాచ్‌లు స్టార్ట్ అవడంతో.. ఎలాగైనా డబ్బులు దక్కించుకోవాలని.. బయట నుంచి దాదాపు రెండు లక్షలు రూపాయల వరకు తీసుకువచ్చి బెట్టింగ్స్‌లో పెట్టాడు. అయితే ఆ డబ్బులన్ని పోవడంతో.. ఎలా తిరిగి చెల్లించాలో అర్ధంకాని స్థితిలో తను మనోవేదనకు గురై.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇంటికి రాకపోవడంతో సోమేశ్ కుటుంబ సభ్యులు.. అతని ఫ్రెండ్స్‌ని, బంధువుల్ని అన్ని చోట్ల తన గురించి ఎంక్వైరీ చేశారు.

సాయంత్రం అయినా కూడా ఇంటికి రాకపోవడంతో.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే రైలు పట్టాలపై డెడ్ బాడీనీ, ఫోన్ గమనించి ఎంక్వైరీ చేయగా సోమేశ్‌దే అని నిర్ధారించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.. దీంతో అతని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. రెండులక్షల ఎలాగైనా చెల్లించేవాళ్లం.. కానీ ప్రాణాలు పోగొట్టుకుంటాడని తాము ఎప్పుడు అనుకోలేదని బోరున విలపించారు. గతంలో కూడా గేమ్స్ ఆడుతూ ఉండే.. కానీ డబ్బులు పెట్టి ఆడుతున్నాడని ఎప్పుడూ కూడా అనుకోలేదని కుటుంబ సభ్యుల చెబుతున్నారు.


కాగా.. బెట్టింగ్ అంటే ఏమిటో కూడా తెలియనోడికి.. ఆన్‌లైన్ గేమ్స్ మీద అసలే ఇంట్రస్ట్ లేనోడికి.. గ్యాంబ్లింగ్ గురించి ఇంచు కూడా అవగాహన లేనోడికి.. డబ్బుల మీద ఆశ కల్పించి.. ఈజీ మనీపై ఇంట్రస్ట్ పుట్టించినవే.. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు. సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్ల మాటల్ని గుడ్డిగా నమ్మి.. అడ్డంగా బుక్కైపోయిన వాళ్ల లెక్కలెన్నో ఉన్నాయి. వాళ్లు పోగొట్టుకున్న డబ్బులకు లెక్కే లేదు. వాళ్లు కోల్పోయిన జీవితాలకు.. విలువ కట్టగలమా? వాళ్ల నష్టాన్ని.. ఈ సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు పూడ్చగలరా?

ఈ ఇన్‌ఫ్లూయెన్సర్లదేముంది.. సింపుల్‌గా వీడియోలో కనిపించి.. గేమ్ ఎలా ఆడాలో చూపించి.. సైడ్ అయిపోతారు. ఆ తర్వాత ఆన్ లైన్ గేమ్స్ ఆడినోళ్లకు.. బెట్టింగ్ యాప్స్‌లోకి దిగినోళ్లకు కనిపిస్తుంది సినిమా. ఆ క్లైమాక్స్ ఎలా ఉంటుందో.. ఎవడూ ఊహించలేడు. శుభం కార్డు పడుతుందో.. సూసైడ్‌ కార్డ్‌తో ఎండ్ అవుతుందో ఎవడూ చెప్పలేడు. అందుకే.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారం ఇంత హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: MMTS రేప్ కేస్ నిందుతుడు మహేష్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..

తెలిసో.. తెలియకో.. డబ్బులకు ఆశపడో.. ఎక్స్‌ట్రా మనీ కోసమో.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు ఈ సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు. కానీ.. ఇలాంటి ప్రమోషన్ల విషయంలో.. కొంత బాధ్యత ఉండాలి. మనమేం చేస్తున్నాం.. ఎలాంటివి ప్రమోట్ చేస్తున్నాం.. వాటి వల్ల జనానికి మంచి జరుగుతుందా.. వాళ్లకు నష్టం కలుగుతుందా.. అనే విచక్షణ ఉండాలి. ఇలాంటి బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల.. ఎంత మంది డబ్బులు పోగొట్టుకుంటారు. ఎంతమంది జీవితాలు నాశనమైపోతాయనే అవగాహన సెలబ్రిటీలకు ఉండాలి. కానీ.. చాలా మంది దీనిని కేవలం ఓ పనిగానే చూస్తారు. తమ బ్రాండ్ వాల్యూ పెరిగిందనుకుంటారు. డబ్బులొస్తున్నాయి కదా.. ఎవడెలా పోతే మనకేంటి అనే నిర్లక్ష్యంతోనే ఇలాంటి ప్రమోషన్లు చేస్తున్నారు. ఇది.. నైతికంగా కరెక్ట్ కాదనే విమర్శలు ఇప్పుడొస్తున్నాయి.

ఈ సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ ఫాలోవర్లపై చాలా ఇంపాక్ట్ చూపిస్తారు. వాళ్లని గుడ్డిగా నమ్మే ఫాలోవర్లు లక్షల్లో ఉంటారు. వారు చెబితే.. ఏదైనా చేసే అమాయకులుంటారు. ఏ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేసినా.. ఫాలోవర్లు వాటిని నమ్మే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది.. బెట్టింగ్ యాప్స్‌కి కూడా వర్తిస్తుంది. మీరు చెప్పారని.. ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న వాళ్లెందరో ఉన్నారు. గ్యాంబ్లింగ్ యాప్స్, సైట్లు ప్రమోట్ చేయడం వల్ల.. అది ఆర్థిక నష్టాలకు, వ్యసనానికి దారితీస్తుందని మీకు తెలియదా? అంత గుడ్డిగా ఎలా ప్రమోట్ చేస్తారు? డబ్బుల కోసం ఏదైనా చేసేస్తారా? అనే ప్రశ్నలు కూడా సమాజం నుంచి తలెత్తుతున్నాయి. అంతేకాదు.. మీరు చేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వల్ల.. వాటిని నమ్మి డబ్బులు పోగొట్టుకున్న వాళ్లందరికీ.. వీళ్లు ఇప్పుడు డబ్బులు తెచ్చిస్తారా? వాళ్ల ఆర్థిక నష్టాలను మీరు పూడుస్తారా? మీ పాటికి మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు దులుపుకున్నారు. ఎప్పుడైనా.. డబ్బులు పోగొట్టుకున్న వాళ్ల సంగతేంటని ఆలోచించారా?

 

Related News

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Kukatpally News: ఎంత పని చేశావ్ దేవుడా..? షటిల్ ఆడుతుండగా కరెంట్ షాక్.. క్షణాల్లో బాలుడు మృతి

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Nagpur Tragedy: దారుణం.. భార్య శవాన్ని బైకుకు కట్టుకుని వెళ్లిన భర్త.. ఎందుకంటే?

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Big Stories

×