ఒకప్పుడు సినిమా విజయం సాధించింది అంటే.. ఎక్కువ కేంద్రాలలో ఏ సినిమా అయితే వంద రోజులు పూర్తి చేసుకుందో.. ఆ సినిమా ఘనవిజయం సాధించిందని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బాక్సాఫీస్ వద్ద సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది కేవలం బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతోనే ముడి పడిపోతుంది అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రతి సినిమాకి కూడా కలెక్షన్ల లెక్కలే ముఖ్యం అన్నట్టు ట్రెండు కూడా మారిపోయింది. ఏ చిత్రానికి ఎక్కువ కలెక్షన్స్ వస్తే ఆ చిత్రం సూపర్ హిట్ అయిపోయినట్టే అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇదే విషయంపై తాజాగా ఆదాశర్మ (Adah Sharma)చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి
బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గోలేంటో అర్థం కావడం లేదు – ఆదాశర్మ
ప్రముఖ బ్యూటీ ఆదాశర్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ‘ది కేరళ స్టోరీస్ ‘ సినిమాతో ప్రేక్షకులలో సరికొత్త ఆలోచనలను క్రియేట్ చేసిన ఈమె.. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా రూ.360 కోట్లు సాధించింది. కానీ ఆ తర్వాత వచ్చిన బస్తర్ : ది నక్సల్ స్టోరీ మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ ఫెయిల్యూర్ గురించి ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” నేను ఏ రోజు కూడా బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి ఆలోచించలేదు. ఎందుకంటే ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నామా లేదా అని మాత్రమే చూశాను. అసలు బాక్సాఫీస్ వద్ద ఈ కలెక్షన్ల గోల ఏంటో నాకు అర్థం కావడం లేదు. బస్తర్ మూవీ మంచి కంటెంట్ ఉన్న సినిమా. అందులో నా పాత్ర బాగుందా లేదా అనేది మాత్రమే నేను ఆలోచించాను. కేరళ స్టోరీ తీసినప్పుడు పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. కానీ కథను నమ్మి చేశాము” అంటూ ఆదాశర్మ కామెంట్లు చేసింది. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక టాలీవుడ్ లో నటించి చాలా రోజులు అవుతుంది. త్వరలోనే నటించే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం.
ALSOREAD.. Tollywood: మరో బిడ్డకు జన్మనిచ్చిన రామ్ చరణ్ హీరోయిన్.. పేరు కూడా పెట్టేశారండోయ్..
ఆదాశర్మ కెరియర్..
ఆదాశర్మ విషయానికి వస్తే.. ఎక్కువగా తెలుగు, హిందీ సినిమాలలో నటించిన ఈమె.. స్కూల్ చదువు పూర్తయిన వెంటనే 2008లో హిందీ హార్రర్ సినిమా 1920 తో అరంగేట్రం చేసింది. ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. అంతే కాదు ఈ సినిమాకి ఉత్తమ ఫిమేల్ డెబ్యూ విభాగంలో ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది. అలా వరుస చిత్రాలలో నటించిన ఈమె.. తెలుగులో హార్ట్ ఎటాక్, సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం వంటి సినిమాలలో నటించి అన్ని సినిమాలతో కూడా మంచి విజయం అందుకుంది. ఇక 2015లో రాణా విక్రమ అనే కన్నడ సినిమాలో కూడా నటించి ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాలన్నీ కమర్షియల్ గా మంచి సక్సెస్ అవడంతో పాటు ఆదాశర్మ కి కూడా మంచి ప్రశంసలు లభించాయి. ఇక ప్రస్తుతం ఈమె నటనకు తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అవడంతో ఇప్పుడిప్పుడే మళ్ళీ తెలుగులో హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.