Hyderabad Crime: భార్య మీద ప్రేమ అని చెప్పుకుంటూ.. ఆమె అందాన్ని హిందిస్తూ.. మానవత్వాన్ని మరిచిపోతున్న మగవారు దారుణానికి పాల్పడుతున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో భార్య ముక్కు అందంగా ఉందని కొరికి తిన్నాడో భర్త.. ఈ ఘటన మరువక ముందే మరొక ఘటన వెలుగు చూసింది. భార్య అందంగా ఉందని తట్టుకోలేక చంపేశాడు.
ఎవ్వరైనా సరే తనకు కాబోయే భార్య అందంగా, చదువుకున్న వారై ఉండాలనుకుంటారు.. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్.. అయింది.. భార్య అందంగా ఉండటాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు.. చివరకు ఆమెను కడతేర్చాడు.. భార్య ఎంతో అందంగా ఉండటం, మంచిగా తయారై బయటకు వెళ్లడాన్ని ఆ భర్త సహించలేకపోయాడు.. అలా తయారయ్యి.. బయటకు వెళ్లొద్దని.. ఇదే విషయమై అనేకసార్లు గొడవ పడేవాడు. అయితే.. ఆమె వినేది కాదు.. చివరకు భర్త సహించలేక.. దారుణానికి పాల్పడ్డాడు.
పెళ్లి చేసుకునేటప్పుడు ఏరికోరి మరీ చేసుకన్న భర్తే ఆమె జీవితానికి కాలయముడయ్యాడు. భార్యపై అనుమానం పెంచుకుని జీవితాతంతం తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తే ఆమెను కడతేర్చాడు. ఈ దారుణమైన ఘటన హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో చోటుచేసుకుంది ఈ ఘటన. కట్టా శుభాషిణి, వెంకటేశ్వర్లకు ఇద్దరు కుమామర్తెలు.. చిన్న అమ్మాయిని 2021లో హైదరాబాద్ కి చెందిన వ్యక్తితో.. ఎంతో ఘనంగా వివాహం చేశారు.
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ఓ కాలనీలో నివాసముంటున్నారు. ఏరికోరి చేసుకున్న అందమైన భార్యతో అతను చాలా కాలం పాటు ఎంతో ప్రేమగా ఉండేవాడు. దీంతో.. వాళ్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగింది.
హాయిగా సాగిపోతున్న వీళ్ల దాంపత్యంలోకి అనుమానం, డబ్బు పిశాచి ఎంటరైంది. ఇక అప్పటి నుంచి భార్యను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. భార్య అందంగా ఉండటం.. ఉద్యోగ రిత్యా రమేశ్ ఆఫీసులో ఎక్కువ సమయం ఉండాల్సి రావటంతో.. తన భార్య వేరే వాళ్లతో వివాహేత సంబంధం పెట్టుకుందోమోనన్న అనుమానం పెంచుకున్నాడు. అది కాస్త రోజు రోజుకు పెరిగిపోయి.. తరచూ భార్యతో గొడవపడేవాడని అమ్మాయి తల్లి ఆరోపిస్తున్నారు.
Also Read: వేసవి సెలవుల సరదా.. ఆపై ఐదుగురు విద్యార్ధులు మృతి.. కడప జిల్లాలో ఘోరం
ఈ నేపథ్యంలో మంగళవారం కూడా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వ్యక్తి ఆమెను దారుణంగా చంపేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురిని పెళ్లైన మొదటి నుంచి చిత్రహింసలు పెట్టేవాడని, కనీసం బయటకు కూడా పంపేవాడు కాదని.. అందంగా ఉందని తట్టుకోలేక అతను చంపేశాడని మృతురాలి తల్లి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. దానిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.