BigTV English

HIT 3 OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న నాని బ్లడ్ బాత్ మూవీ.. ఎందులో ఎప్పుడంటే..?

HIT 3 OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న నాని బ్లడ్ బాత్ మూవీ.. ఎందులో ఎప్పుడంటే..?

HIT 3 OTT: నాచురల్ స్టార్ నాని బ్లడ్ బాత్ మూవీ హిట్ 3 మే 1న థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. నాని కెరియర్ లోనే బిగ్ బ్లాక్ బాస్టర్ చిత్రంగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికీ ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో థియేటర్లలో సందడి చేస్తోంది. ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లుగా హిట్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆ వివరాలు చూద్దాం..


ఓటీటీలోకి వచ్చేస్తున్న నాని..హిట్ 3

శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ మొదటి, రెండు భాగాలు సక్సెస్ అయ్యాయి. ఇక నాని హీరోగా లేటెస్ట్ గా వచ్చిన హిట్ త్రీ అంచనాలను మించి సక్సెస్ అయ్యింది. హిట్ త్రీ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జూన్ 3వ తేదీ నుండి నెట్‌ఫ్లిక్స్ లో హిట్ 3 స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే థియేటర్లలో రిలీజ్ అయిదు వారాలు అవుతుండడంతో ఈ మూవీ స్ట్రీమింగ్ కు సిద్ధమైనట్లు సమాచారం. జూన్ 3వ తేదీ నుండి నాని నెట్టింట్లో సందడి చేయడానికి సిద్ధం అయ్యాడు.. ఇక ఇక్కడ నాని హిట్ 3 ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.


బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ..

నాచురల్ స్టార్ నాని హిట్ 3 సినిమా వరల్డ్ వైస్ గా బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి,వాస్తు టాక్ తో దూసుకుపోతుంది. నాని చిత్రాల్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై చిత్రం రూపొందింది ఈ చిత్రం బడ్జెట్ దాదాపు 60 కోట్ల రూపాయలతో నిర్మించారు . రిలీజ్ అయిన రోజు నుండి జోరుని చూపెడుతూ కలెక్షన్స్ పరంగా లాభాలను సొంతం చేసుకుంటుంది. ఈ చిత్రం 13 వ రోజు(సోమవారం) దాదాపు 93 లక్షల వసూలు చేసింది. వరల్డ్ వైస్ గా 85 కోట్లు కలెక్షన్స్ ని అందుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 24 కోట్లు వసూలు చేసిన మూవీగా హిట్ 3నిలిచింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా 109.77 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది హిట్ 3 చిత్రంలో నాని అర్జున్ సర్కార్ పాత్ర అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఈ మూవీ లో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించారు.క్రైమ్ థిల్లర్ మూవీ గా ఆడియన్స్ ను అలరించింది.ఇక  హిట్ సిరీస్ లో భాగంగా తదుపరి చిత్రం హిట్ 4.ఫోర్త్ కేసును, చెన్నైలో కొత్త అధికారిని పరిచయం చేస్తూ మూవీ ని ముగించారు.ఈ చిత్రంలో కార్తీ హీరోగా నటించినట్లు సమాచారం.

Amzon Prime Video : సడన్ షాక్ ఇచ్చిన ప్రైమ్ వీడియో… డబ్బులు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ఇక దండగ

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×