BigTV English

Smriti Irani: అలాంటి క్యారెక్టర్ తో 15 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. రాజకీయానికి దూరం కానుందా..?

Smriti Irani: అలాంటి క్యారెక్టర్ తో 15 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. రాజకీయానికి దూరం కానుందా..?

Smriti Irani : స్మృతి ఇరానీ (Smriti Irani).. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రిగా పనిచేసిన ఈమె ఇప్పుడు మళ్లీ దాదాపు 15 సంవత్సరాల తర్వాత బుల్లితెర ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. ప్రముఖ పాపులర్ బుల్లితెర సీరియల్ అనుపమ ద్వారా రీ యంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. మీడియా కథనాలను బట్టి చేస్తే స్మృతి ఇరానీ ఈ సీరియల్ ద్వారా మళ్లీ బుల్లితెర రంగ ప్రవేశం చేయబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సీరియల్లో రూపాలి గంగూలీ తో పాటు పలువురు స్టార్ సెలబ్రిటీలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈమె కూడా రాజకీయ రంగానికి దూరం అయ్యి ఇందులో నటించబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినా ప్రస్తుతం ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది..


బుల్లితెర రీయంట్రీ ఇవ్వనున్న స్మృతి ఇరానీ..

బాలీవుడ్ బుల్లితెర ఇండస్ట్రీలో అనుపమ సీరియల్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత 5 సంవత్సరాలుగా ఈ షో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత సీరియల్ కథ కూడా మారిపోయింది. ఇప్పుడు ఈ సీరియల్ లోకి స్మృతి ఇరానీ ప్రవేశించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే 15 ఏళ్ల తర్వాత మళ్లీ స్మృతి ఈ సీరియల్ లోకి అడుగుపెట్టబోతోందని చెప్పవచ్చు. నిజానికి సీరియల్ మొదలైన కొత్తలో చాలామంది తారలు ఇందులో నటించి, ఆ తర్వాత షో నుండి తప్పుకున్నారు. వివిధ కారణాలవల్ల మళ్లీ సీరియల్లోకి ప్రవేశించలేదు. గత 5 సంవత్సరాలుగా సీరియల్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇప్పుడు మళ్లీ ఈ సీరియల్ ద్వారానే రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.


రూపాలీ గంగూలీ తో కలిసి నటించబోతున్న స్మృతి.

రాజన్ షాహి దర్శకత్వం వహిస్తున్న అనుపమ సీరియల్ లో ఈ మధ్య కొత్త సెలబ్రిటీలు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో రూపాలీ గంగూలీ తో పాటు అలీషా పర్వీన్ , శివమ్ ఖజురియా వంటి వారు ఇందులో నటిస్తున్నారు. ఇప్పుడు స్మృతి ఇరానీ అతిథి పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అనుపమ సీరియల్ లో స్మృతి స్పెషల్ క్యామియోలో కనిపించనుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో ఇద్దరు ప్రముఖ టెలివిజన్ నటీమణులు కలిసి నటించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అటు స్మృతి కానీ ఇటు మేకర్స్ కానీ ఎవరూ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇందులో ఈమె కామెడీ పాత్ర పోషిస్తుంది అంటూ వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. ఇక ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

అనుపమ సీరియల్..

అనుపమ సీరియల్ విషయానికి వస్తే గత 5 సంవత్సరాలుగా దూసుకుపోతూనే ఉంది ఈ నేపథ్యంలోనే చాలామంది స్టార్స్ సీరియల్ కి గుడ్ బై చెప్పారు. ఇందులో సుదాన్షు పాండే, మదాల్సా శర్మ, నిధి షా వంటి వారు కూడా సీరియల్ నుంచి తప్పుకున్నారు. ఈ ముగ్గురు స్టార్స్ కీలక పాత్రలు పోషించినవారే. ఇక గత నాలుగేళ్ల క్రితం వీరంతా సీరియల్ నుంచి తప్పుకున్నారు. ఇక ఇప్పుడు రూపాలి గంగూలీ తో పాటు స్మృతి కలిసి నటించబోతుందని సమాచారం. ఇక స్మృతి ఇరానీ చివరిగా 2009లో ఒక కామెడీ షో లో కనిపించింది. ఆ తర్వాత టీవీ ని వదిలి రాజకీయ రంగంపై దృష్టి సారించింది. ముఖ్యంగా ఈమె నటించినా” క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ ” వంటి షో లో కనిపించింది .ఈ షో తో భారీ పాపులర్ కి సంపాదించుకున్న ఈమె.. మళ్లీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×