Hyderabad Doctor Missing: హైదరాబాద్‌కు చెందిన యువ డాక్టర్ మైనంపల్లి అనన్యరావు తుంగభద్రలో గల్లంతైంది. బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితులతో కలిసి హంపి పర్యటనకు వచ్చింది ఈ డాక్టర్. అక్కడ హిస్టారికల్ ప్రాంతాలను విజిట్ చేసిన తర్వాత బుధవారం ఉదయం ఈతకు వెళ్లారు. స్విమ్మింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. నీటి ఉద్ధృతికి ఆమె మిస్సింగ్ అయినట్టు చెబుతున్నారు.
ఎశరీ డాక్టర్ అనన్యరావు
స్నేహితులతో కలిసి సరదాగా హంపి పర్యటనకు వెళ్లింది హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మైనంపల్లి అనన్యరావు. ఆమె వయస్సు 26 ఏళ్లు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తోంది. అనన్యరావు తండ్రి డాక్టర్ మోహన్‌గా గుర్తించారు. వీకేసీ ఆసుపత్రిలో ఆమె డాక్టర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
హంపిలో ఏం జరిగింది?
ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమె కర్ణాటకలోని హంపి ప్రాంతానికి వచ్చింది. అక్కడ చారిత్రక కట్టడాలు వీక్షించింది. మంగళవారం రాత్రి సణాపుర గ్రామంలో ఓ అతిథి గృహంలో వీరంతా రెస్ట్ తీసుకున్నారు. బుధవారం ఉదయం కొప్పాల్ జిల్లాలోని తుంగభద్ర డ్యామ్ వద్దకు వెళ్లారు.
నదిలో ఈతకు వెళ్లిన అనన్య తొలుత ఫోటోలు తీసుకుంది. ఈత కొట్టేందుకు ఆ తర్వాత పెద్ద రాయిపై నుంచి నదిలోకి దూకింది. నీటి ఉద్ధృతి కారణంగా ఆమె కొట్టుకుపోయింది. ప్రత్యక్షంగా చూసిన కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని బయటపెట్టారు. అనన్య మిస్సింగ్ అయిన ప్రదేశంలో తుంగభద్ర రాతి గుహల్లో నీరు ప్రవహిస్తూ ఉంటుంది.
ALSO READ: నిద్రపోతున్న తండ్రిపై పెట్రోల్ పోసి
దీనిపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని, ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. బహుశా యువతి ఈ గుహల్లో చిక్కుకు పోయింటారన్నది పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే గంగావతి గ్రామీణ ప్రాంతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక గజ ఈతగాళ్లు, అగ్నిమాపక దళం సాయంత్రం వరకు ప్రయత్నించింది. అయినా యువ వైద్యురాలి జాడ కనిపించలేదు.
ఉన్నతాధికారులు వచ్చి ఆ ప్రాంతానికి పరిశీలించారు. ఈత కోసం నీటిలో దూకడానికి ముందు అనన్య రెడీ అవుతున్న వీడియో ఒరటి వైరల్ అవుతోంది. వన్.. టూ.. త్రీ అంటూ స్నేహితులు కౌంట్ డౌన్ మొదలుపెట్టినట్టు ఆ వీడియోలో స్పష్టంగా వినిపించింది. నదిలో దూకిన తర్వాత పైకి తేలుతూ కాసేపు ఈతకొట్టింది అనన్య. ఆ తర్వాత కాసేపటికి కనిపించలేదు.
ఈలో స్నేహితులు కేకలు వెేసినా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదని అంటున్నారు. ఆ తర్వాత గల్లంతైనట్టు భావించారు. వెంటనే అప్రమత్తమైన స్నేహితులు పోలీసులు, అగ్నిమాపక విభాగం, రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఘటనపై కొప్పల్ ఎస్పీ మాట్లాడుతూ, అనన్య కోసం గాలిస్తున్నామని, ఆమె ప్రాణాలతో ఉందో లేదో తెలీదన్నారు.
గంగావతి రూరల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. సరదా కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంది అనన్యరావు. ఆమె బతికి ఉందా లేదా అనేది తెలియాల్సివుంది. ప్రస్తుతం అనన్య స్విమ్మింగ్ చేసిన చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు తీవ్రతరం చేశారు.