Geeta Singh:గీతా సింగ్ (Geeta Singh).. ఈ పేరు చెబితే వెంటనే గుర్తు పట్టకపోవచ్చు కానీ అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా నటించిన ‘కితకితలు’ సినిమాలో గీతా క్యారెక్టర్ లో నటించిన హీరోయిన్ అంటే ప్రతి ఒక్కరు వెంటనే గుర్తుపట్టేస్తారు. ఇక ఆమె గీతా సింగ్. అంతకుముందు కూడా కమెడియన్ గా నటించి మెప్పించిన ఈమె .. ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఇక తన అద్భుతమైన నటనతో అందరి మన్ననలు పొందింది గీతా సింగ్. నార్త్ ఇండియా కు చెందిన ఈమె టాలీవుడ్ లో లేడీ కమెడియన్ గా 2005లో ‘ఎవడి గోల వాడిదే’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాతే కితకితలు సినిమాతో అందరి మనసులు దోచుకున్న ఈమెకు వరుసగా అవకాశాలు తలుపుతట్టాయి. అలా దొంగల బండి, ఆకాశరామన్న, ప్రేమాభిషేకం, సీమ టపాకాయ్, శశిరేఖ పరిణయం, కల్యాణ వైభోగమే, రెడ్, సరైనోడు, కెవ్వు కేక ,ఈడోరకం ఆడోరకం, జంప్ జిలాని, తెనాలి రామకృష్ణ తదితర హిట్ చిత్రాలలో లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. 2019లో రెండు చిత్రాలలో నటించిన ఈమె.. ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో చాలా తక్కువ చిత్రాలలో నటించి ఆకట్టుకుంది.
కొడుకును కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయిన గీతా సింగ్..
ఇదిలా ఉండగా సుమారుగా రెండు సంవత్సరాల క్రితం గీతా సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. చేతికి వచ్చిన కొడుకు కన్నుమూయడంతో గీతా సింగ్ ఇప్పటికి కోలుకోలేకపోతోంది. గురువారం అనగా (ఫిబ్రవరి 18న) గీతా సింగ్ కుమారుడి వర్ధంతి కావడంతో ఈ సందర్భంగా తన కొడుకుకు నివాళులర్పిస్తూ.. సోషల్ మీడియా ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. “నా కొడుకు నాతో ఉన్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ.. మిస్ యు రా” అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది గీతా సింగ్. గీతా సింగ్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్ లు గీతా సింగ్ కి ధైర్యం చెబుతూ పోస్ట్ పెడుతున్నారు. మొత్తానికైతే గీతా సింగ్ కొడుకు మరణం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది అని చెప్పవచ్చు. ఇక మరికొంతమంది ఈ బాధ నుంచి బయట పడాలంటే.. మళ్ళీ మీరు పనిలో బిజీ అవ్వాలి. ఇప్పటికైనా మించి పోయింది లేదు. మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చి మీ బాధను మరిచిపోయే ప్రయత్నం చేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి గీత సింగ్ ఇప్పటికైనా తన బాధను దిగమింగుకొని మళ్లీ ఇండస్ట్రీలోకి వస్తుందేమో చూడాలి.
గీతా సింగ్ కెరియర్..
గీతా సింగ్ విషయానికి వస్తే.. చివరిగా ఇంటి నెంబర్ 13, అన్ స్టాపబుల్ అనే సినిమాలలో నటించింది. మరి ఏడాది కూడా ఈమెకు అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2005 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈమె వచ్చిన ఏడాదికే భారీ పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా ఈవీవీ దర్శకత్వంలో ప్రేక్షకులను అలరించిన గీతా సింగ్ ఇప్పుడు ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">