E-Paper
Advertisement

హస్తినాపురంలో కారు బీభత్సం.. పీకలదాకా తాగి డ్రైవింగ్‌.. ముగ్గురు స్పాట్

హస్తినాపురంలో కారు బీభత్సం..  పీకలదాకా తాగి డ్రైవింగ్‌.. ముగ్గురు స్పాట్
Advertisement

Hyderabad: హైదరాబాద్‌ నగర శివార్లలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం వద్ద సాగర్ రోడ్డుపై మద్యం మత్తులో అతివేగంగా దూసుకొచ్చిన ఒక కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో మహావీర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఇద్దరు బీటెక్ విద్యార్థులతో పాటు, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మరో యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయారు.

స్థానికుల సమాచారం ప్రకారం.. కారు డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని అత్యంత వేగంగా, అదుపు తప్పి నడిపాడు. తొలుత రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు, ఆ తర్వాత బైక్‌పై వెళ్తున్న విద్యార్థులను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే, బాధితులను సుమారు 100 మీటర్ల మేర కారు ఈడ్చుకెళ్లింది. అనంతరం ఆ కారు రోడ్డుపై పల్టీలు కొట్టి ఆగిపోయింది. ఘటనా స్థలంలోనే విద్యార్థులు విగతజీవులుగా పడి ఉండటం చూసిన స్థానికులు చలించిపోయారు.

Advertisement

ఈ విషయం తెలియగానే మహావీర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరుకుని ఆందోళనకు దిగారు. తమ తోటి విద్యార్థుల మృతికి కారణమైన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, మద్యం మత్తులో డ్రైవింగ్ చేసే వారి పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించకూడదని డిమాండ్ చేశారు. ఈ నిరసనతో సాగర్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

సమాచారం అందుకున్న వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతివేగం , డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: మేడ్చల్‌లో భారీ చోరీ.. నిద్రిస్తుండగానే 13 తులాల బంగారం, 4 లక్షల నగదు మాయం!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×