Lucky Draw Fraud: తిరుమల వెంకన్న పేరుతో లక్కీ డ్రా నిర్వహిస్తూ కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న ఓ ముఠాపై సినీ నటి, బీజేపీ నేత కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం 399 రూపాయలతో ఫార్చ్యూనర్ కార్లు, ఐఫోన్లు గెలుచుకోవచ్చని ప్రవీణ్ కాసా, సిద్ధమోని మహేందర్ అనే యువకులు అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. ప్రమోషన్ కోసం తిరుమల ఆలయాన్ని వినియోగించుకోవడంతో పోలీసులు 318(4) సెక్షన్, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద కొందరు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు భారీ మోసానికి పాల్పడుతున్నారని నటి కరాటే కల్యాణి పోలీసులను ఆశ్రయించారు. లక్కీ డ్రా పేరిట ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కేవలం రూ.399 కడితే లక్కీ డ్రాలో ఫార్చ్యూనర్ కారు, ఐఫోన్, టీవీ, బైక్ వంటి ఖరీదైన బహుమతులు గెలుచుకోవచ్చని ప్రవీణ్ కాసా, సిద్ధమోని మహేందర్ అనే ఇద్దరు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెనర్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారని కరాటే కల్యాణి తన ఫిర్యాదులో పోలీసులు తెలిపారు. రూ.399కే లక్కీ డ్రా అంటూ తిరుమల ఆలయం ముందు వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
టీటీడీ పేరుతో లక్కీ డ్రా మోసం
టీటీడీ పేరుతో లక్కీ డ్రా నిర్వహిస్తూ కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న ముఠాపై సినీ నటి, బీజేపీ నేత కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేవలం 399 రూపాయలతో ఫార్చ్యూనర్ కార్లు, ఐఫోన్లు గెలుచుకోవచ్చని ప్రవీణ్ క్యాసా, సిద్ధమోని మహేందర్ అనే… pic.twitter.com/VMz8A4P9xb— ChotaNews App (@ChotaNewsApp) January 18, 2026
పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఇలా మోసపూరిత ప్రచారాలకు వాడుకుంటూ.. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని కరాటే కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లక్కీ డ్రా పేరుతో నిందితులు కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆమె ఆరోపించారు. కరాటే కల్యాణి ఫిర్యాదుతో హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులపై ఐటీ చట్టం 2008లోని సెక్షన్ 318(4), సెక్షన్ 66 కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలు నమ్మొద్దని కరాటే కళ్యాణి కోరారు.
తక్కువ ధరకే కార్లు, బైకులు ఇస్తామంటూ అమాయకులను వంచిస్తున్నారని కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు నిందితులు ప్రవీణ్ కాసా, మహేందర్‌లపై కేసు నమోదు చేసి, వారి ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ప్రజలు ఇటువంటి బెట్టింగ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.
Also Read: అన్వేష్ పై మరోసారి ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి.. ఈసారి గట్టి దెబ్బే!