E-Paper
Advertisement

బీఎన్ రెడ్డి నగర్‌లో దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

బీఎన్ రెడ్డి నగర్‌లో దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
Advertisement

Hyderabad: హైదరాబాద్‌ నగరంలోని బీఎన్‌ రెడ్డి నగర్‌ పరిధిలో ఉన్న టీచర్స్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై పెంచుకున్న అనుమానం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన నర్సింహ (60), వసంత (52) దంపతులు గత కొంతకాలంగా ఇక్కడ నివసిస్తున్నారు. నర్సింహ కూలి పనులు చేస్తుండగా, వసంత చుట్టుపక్కల ఇళ్లలో పనిమనిషిగా ఉంటూ సంసారాన్ని ఈదుతున్నారు.

అయితే.. గత కొంతకాలంగా భార్య ప్రవర్తనపై నర్సింహ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. బుధవారం ఉదయం కూడా ఇదే విషయంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆ కోపం చల్లారని నర్సింహ, ఎలాగైనా ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. వసంత యధావిధిగా తన పని కోసం ఇంటి నుంచి బయలుదేరగా, మార్గ మధ్యలో ఆమెను అడ్డుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేయడంతో, తీవ్ర రక్తస్రావమై వసంత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

Advertisement

నడిరోడ్డుపై జరిగిన ఈ ఘోరాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నర్సింహను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Also Read: అన్న చేసిన తప్పుకు చెల్లి బలి.. వికారాబాద్‌లో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య!

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×