E-Paper
Advertisement

Mango Tragedy: నారాయణగూడలో దారుణం.. మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్లు మృతి..!

Mango Tragedy: నారాయణగూడలో దారుణం.. మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్లు మృతి..!
Advertisement

Mango Tragedy: హైదరాబాద్‌లోని నారాయణగూడలో దారుణం చోటుచేసుకుంది. మామిడి పండ్లు తిని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. నారాయణగూడ పరిధిలోని విఠల్‌వాడి అనే ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వైజినాథ్, ఇందుమతి అనే దంపతులు జీవనోపాది కోసం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.

ఇద్దరు మృతి..

అయితే రేణుక అనే మహిళ తమ బందువు నారాయణగూడ జలమండలి ప్రాంతం సమీపంలో ఓ షాపులో మామిడి పండ్లను కోనుగోలు చేసి తమ బందువులైన వైజినాథ్ ఇంటికి తీసుకుని వచ్చింది. అనంతరం వాటిని ఇందుమతితో పాటు కుటుంభంలోని నలుగురి కుమార్తెలకు ఇచ్చింది. దీంతో పండ్లు తిన్న తరువాత నలుగురు పిల్లలకు ఓక్కసారిగి వాంతులు, కల్లు తిరగడం, వీరచనాలు మోదలయ్యాయి. దీంతో అప్రమత్తమైన కుటుంభ సభ్యులు తమ నలుగురి పిల్లలను కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెల్లారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైజినాథ్ మూడో కుమార్తె భువనేశ్వరి సోమవారం రోజున మృతి చెందింది. ఆ తర్వాత మరుసటి రోజున ఆమె చెల్లెలు సంధ్య కూడా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. మిగతా ఇద్దరు పిల్లల పరిస్ధతి కూడా విషమంగా ఉండటంతో ప్రస్ధుతం వారు చికిత్స పోందుతున్నారు.

Advertisement

Also Read: Amaravati Projects: ఏపీ రాజధానిలో ఢిల్లీ లెవెల్ రాజకీయం.. 22 ఎకరాల్లో కేంద్రం వేస్తున్న భారీ స్కెచ్ ఇదే..?

ప్రమాదకర రసాయనాలు..

జరిగిన సంఘనపై భాదితులు పోలీసులకు సమాచారం అందిచారు. దీంతో సంఘటనా స్థలానికి చేరిన పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారులు తమ మామిడి పండ్లను తొందరగా మాగబెట్టడానికి ప్రమాదకర రసాయనాలను వాడి ఉండవచ్చని పొలీసులు అనుమానిస్తున్నారు. దీని ద్వారానే ఫుడ్ పాయిజన్ జరిగి ఉండవచ్చని తెలిపారు.

Advertisement

Also read: హైదరాబాద్‌లో కీలక ఘట్టం.. ఫ్యూచర్‌ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×